ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్కు ఎంపికైనందుకు తన తండ్రి ఎంతగానో సంతోషించినట్లు ఇషాన్ కిషన్ తెలిపాడు.“ అసలైన ఆట అంటే టెస్ట్ క్రికెట్. అందులోనే సవాళ్లు ఉంటాయి. బ్యాట్స్మెన్ నైపుణ్యాలు బయటపడతాయి. నేను ఎంపిక కావటం సంతోషంగా ఉంది “ అన్నాడు. శుభమన్ గిల్ ఇషాన్ను ఇంటర్వ్యూ చేశాడు. టీ 20, వన్డే మాదిరిగా బౌండరీతో టెస్ట్ ప్రారంభిస్తావా అని అడగ్గా.. అక్కడ పరిస్థితిని బట్టి ఆడతానని చెప్పాడు. సిక్సులు కొట్టడం కంటే జట్టును మెరుగైన స్థితిలో ఉంచడమే ప్రాధాన్యత అన్నాడు.