యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ డబుల్ సెంచరీ చేయడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. గిల్ 200 పరుగులు సాధించిన తర్వాత డగౌట్‌లో సహచర ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అందులో జమ్మూ ఎక్స్‌ప్రెస్ చప్పట్లు కొడుతూ డాన్స్ చేస్తూ కనిపించాడు. 208 పరుగుల వద్ద ఔట్ అయిన తర్వాత గిల్‌ను డ్రెస్సింగ్ రూమ్ వద్ద అభినందించారు. కోహ్లి, హార్దిక్ పాండ్యా, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మెచ్చుకున్నారు.