• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షకీబ్‌ ఎందుకింత ఆగ్రహం

    [VIDEO:](url) బంగ్లాదేశ్‌ ఆల్‌ రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్‌ లీగ్‌లో చట్‌గావ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. బౌలర్‌ వేసిన బౌన్సర్‌ షకీబ్‌ను దాటి కీపర్‌ చేతిలోకి వెళ్లింది. బాల్‌ను వైడ్‌గా ప్రకటించలేదు. దీంతో సహనం కోల్పోయిన షకీబ్‌ అరవటంతో పాటు క్రీజు వదిలి అంపైర్‌ దగ్గరకు వెళ్లాడు. అతడితో కాస్త దురుసుగా ప్రవర్తించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. Shakib Getting furious with an umpire … Read more

    LIVE: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్

    మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విశాఖలో ఘనంగా జరుగుతోంది. ఆంధ్రా యూనివర్సిటీలో కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిరంజీవి, మాస్‌ మహారాజా రవితేజ ఇద్దరు కలిసి వేడుకకు హాజరయ్యారు. శృతిహాసన్‌కు అనారోగ్యం కారణంగా రాలేదని తెలుస్తోంది. చిత్రానికి బాబి దర్శకత్వం వహించగా…దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. జనవరి 13న సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.

    మీరిచ్చే టీ తాగను, విషం కలిపిస్తే : అఖిలేష్‌

    [VIDEO:](url) సమాజ్‌వాద్‌ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఎస్పీ ట్విటర్‌ హ్యాండిల్‌ చేసే వ్యక్తిని అరెస్ట్‌ చేయడంతో అతడిని విడుదల చేయాలని అఖిలేశ్‌ పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వారు ఇచ్చిన టీ తాగేందుకు నిరాకరించారు. “ నాకు పోలీసుల మీద నమ్మకం లేదు. టీలో విషం కలిపి ఇస్తారేమో. నేను బయటి నుంచి తెప్పించుకుంటాను. అవసరమైత కప్పు తీసుకుంటాను “ అన్నారు. #WATCH समाजवादी पार्टी प्रमुख अखिलेश यादव … Read more

    సూర్య నా ఆట చూసి ఉండడు: ద్రవిడ్

    శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్‌ను కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ సరాదాగా [ఇంటర్వ్యూ](url) చేశాడు. వివిధ ఆసక్తికర అంశాల గురించి ప్రశ్నలు వేశాడు. “ నా బ్యాటింగ్ చూడని వారిలో సూర్య ఉంటాడు నువ్వు చూసి ఉండవనే అనుకుంటున్నా అందులో ఎలాంటి సందేహం లేదు ” అని ద్రవిడ్ అన్నారు. దీనికి స్కై నవ్వుతూ నేను చూశానని పేర్కొన్నాడు. ప్రాక్టీస్‌లో విభిన్నమైన షాట్స్ ఆడలేేదు ఎందుకని అడగ్గా.. కేవలం బ్యాట్ మిడిల్‌ అవుతుందో లేదో చూస్తానని సూర్య చెప్పాడు. ???????? … Read more

    దిల్లీ మేయర్‌ ఎన్నిక గందరగోళం

    [VIDEO:](url) దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక రసాభాసగా మారింది. మేయర్‌ ఎన్నికకు సంబంధించి ప్రిసైడింగ్‌ అధికారి నియామకంలో లెఫ్టినెంట్ గవర్నర్‌పై ఆప్‌ విమర్శలు చేస్తూ నిరసనకు దిగింది. ఈ క్రమంలో ఆప్‌, భాజపా నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్వల్పంగా తోపులాట జరగటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా కంచుకోటను బద్ధలు కొడుతూ ఆప్‌ 134 స్థానాల్లో విజయం సాధించింది. కమలం పార్టీకి 104 స్థానాలు దక్కాయి. #WATCH | Delhi: Chaos continues at Civic Center … Read more

    గజగజలాడిస్తున్న బాంబ్‌ సైక్లోన్‌

    కాలిఫోర్నియాను బాంబ్‌ [సైక్లోన్‌ ](url)గజగజలాడిస్తోంది. ఒక్కసారిగా వరదనీరు పోటెత్తడంతో జనజీవనం స్తంభించింది. సుమారు 1,80,000 ఇళ్లు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా లేదు. ఓ ఇంటిపై చెట్టు పడి రెండేళ్ల చిన్నారి చనిపోయింది. ఓ యువతి వాహనం వరదలో చిక్కుకుని స్తంభాన్ని ఢీకొట్టడంతో మృతిచెందిందని అధికారులు చెప్పారు. 72 కిలోమీటర్ల మేర తీరప్రాంత హైవేను మూసివేశారు. గంటకు 136 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండటంతో శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి 70 విమానాలు రద్దు చేశారు. ? CALIFORNIA | Capitola Beach and Pier are … Read more

    తెలుగు పరిశ్రమ గురించి తెలుస్తుంది: రాజమౌళి

    ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్న రాజమౌళి అదిరిపోయే [స్పీచ్](url) ఇచ్చారు. “ ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. మీరు నా చిత్ర యూనిట్‌లో ప్రతి ఒక్కరిని గౌరవించారు. దక్షిణాదిలోని చిన్న తెలుగు పరిశ్రమను చాలామంది దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి చిత్రపరిశ్రమ ఉందని చాలామందికి తెలీదు. దీనివల్ల వారందరికీ తెలుస్తుంది. భారతీయులు ఎంత ఆదరించారో ఇక్కడ కూడా అదే రెస్పాన్స్‌ వచ్చింది” అన్నారు. ❤️‍?❤️‍?❤️‍? SS RAJAMOULI ???pic.twitter.com/kCq3TVX5nY — RRR Movie (@RRRMovie) January … Read more

    కాఫీ తాగుతూ ఉక్రెయిన్‌ సైనికుడి ఫైరింగ్‌

    ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ ఓ సైనికుడి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఉక్రెయిన్‌ సైనికుడు కాఫీ తాగుతూ మాస్కో సేనలపై దాడులు చేస్తున్నాడు. కాఫీ తాగుతున్న అతడికి ఫైరింగ్ శబ్ధం వినపడగానే వెంటనే లేచి శత్రుమూకలపై కాల్పులు జరిపాడు. ఈ వీడియో చూసిన వారంతా జవాన్ నిబద్ధతని మెచ్చుకుంటున్నారు. దాదాపు సంవత్సరంపాటుగా యుద్ధం కొనసాగుతుంది. అటు పుతిన్ సేనలు దాడులు ఆపడం లేదు. జెలెన్‌స్కీ సైన్యం కూడా ధీటుగానే ఎదుర్కొంటుంది.

    కిక్కిరిసిన మైదానం…జరిగింది మ్యాచ్‌కాదు

    [VIDEO](url): పాకిస్థాన్‌లోని ఓ మైదానంలో జనాలు కిక్కిరిసిపోయారు. కానీ, అక్కడ క్రికెట్‌, పుట్‌బాల్ మ్యాచ్‌లాంటిది జరగలేదు. మరి ఎందుకు అంతమంది ఉన్నారు అనుకుంటున్నారా? వాళ్లు ఓ రాతపరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ ఆసక్తికర సంఘటన వైరల్‌ అయ్యింది. 1600 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఇటీవల రాతపరీక్ష నిర్వహించారు. ఐదేళ్లుగా భర్తీ చేయకపోవటంతో అభ్యర్థులు పోటెత్తారు. 30 వేల మంది రావటంతో మైదానంలో పరీక్ష పెట్టారు. More than 30,000 male and female candidates from all over Pakistan … Read more

    బౌండరీలో ఇలా కూడా క్యాచ్‌ పట్టొంచంట

    ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో మైకేల్‌ నీసర్ పట్టిన [క్యాచ్‌](url) గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్‌ ఆటగాడు సిల్క్‌ కొట్టిన షాట్‌ను నీసర్ బౌండరీలైన్‌లో పట్టుకున్నాడు. బ్యాలెన్స్ ఆగకపోవటంతో బంతిని గాల్లోకి విసిరి బౌండరీ లైన్ దాటాడు. బాల్‌ కూడా లైన్‌కి అవతల వైపు వెళ్లింది. ఈ క్రమంలో మరోసారి గాల్లో పట్టుకొని బయటకు విసిరాడు. దీంతో అంపైర్ ఔట్‌ ఇచ్చాడు. ఇది క్యాచ్‌ కాదని, క్యాచ్‌ల విషయంలో రూల్స్ మార్చాలని అంటున్నారు. Michael Neser's juggling … Read more