[VIDEO:](url) బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో చట్‌గావ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. బౌలర్ వేసిన బౌన్సర్ షకీబ్‌ను దాటి కీపర్ చేతిలోకి వెళ్లింది. బాల్‌ను వైడ్‌గా ప్రకటించలేదు. దీంతో సహనం కోల్పోయిన షకీబ్ అరవటంతో పాటు క్రీజు వదిలి అంపైర్ దగ్గరకు వెళ్లాడు. అతడితో కాస్త దురుసుగా ప్రవర్తించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.