జమ్ము కశ్మీర్‌లో మరోసారి హిమపాతం [అలజడి](url) సృష్టించింది. ప్రముఖ హిల్ స్టేషన్ సోనా మార్గ్‌లో అవలాంచ్ ఏర్పడింది. ఓ నిర్మాణ సంస్థ అక్కడ సొరంగ మార్గం నిర్మిస్తోంది. ఆ ఉద్యోగులు అక్కడే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. మంచు ఉప్పెన రావటంతో ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. వారికి ఏం కాలేదని సురక్షితంగా ఉన్నారని సంస్థ యాజమాన్యం తెలిపింది. నాలుగు దిక్కుల నుంచి వస్తున్నట్లు కనిపించే దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.