• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు తెలిపిన విజయ్

    తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పది సంవత్సరాల పండగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ప్రజలపై ప్రేమతో పట్టుదలగా పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చూపించిన మన తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు అంటూ ప్రశంసించారు. ఈమేరకు వీడియో విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు @TheDeverakonda ❤️❤️#TelanganaFormationDay #TelanganaTurns10 pic.twitter.com/ZI8gAs4BMy — Samrat (@teiangana) June 1, 2023

    మహేష్ బాబు దెబ్బకు యూట్యూబ్ షేక్

    సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ మూవీ నుంచి విడుదలైన ‘మాస్ స్ట్రైక్ గ్లింప్స్’ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియో ఇప్పటి వరకు 20 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకెళ్తోంది. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గ్లింప్స్‌ను మరోస్థాయిలో ఉంచింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘గుంటూరు కారం’ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

    పవన్ కళ్యాణ్ సినిమాపై తేజ క్రేజీ కామెంట్స్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాపై డైరెక్టర్ తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన అహింస చిత్రం ప్రమోషన్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్.. పవన్ కళ్యాణ్‌ కోసం మీరు ఎలాంటి కథను తయారు చేస్తారు అని ప్రశ్నించాడు. ‘రీసెంట్‌గా వచ్చిన ఉస్తాద్ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. పవన్ సినిమా అంటే ఆ విధంగా ఉండాలి. చూడగానే సినిమా హిట్ అనే ఫీలింగ్ వచ్చింది’ అని చెప్పుకొచ్చాడు. Here's what Sensational Director #Teja says … Read more

    నాటు నాటు సాంగ్‌కు ఉక్రెయిన్ ఆర్మీ డ్యాన్స్

    RRR చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఉక్రెయిన్ ఆర్మీ సైన్యం డాన్స్ చేయడం వైరల్‌గా మారింది. ఈ సాంగ్‌ను ఉక్రెయిన్‌లోనే చిత్రీకరించిన సంగతి తెలిసిందే. దీనితో ఆ దేశానికీ చిత్ర యూనిట్ కి కూడా మంచి బంధం ఏర్పడింది. పైగా గత కొన్నాళ్ల కితం యుద్ధ సమయంలో అయితే రామ్ చరణ్ అక్కడ తనకి తన బాడీ గార్డ్‌గా వర్క్ చేసిన అతనికి సాయం అందించినట్టుగా తెలిసింది. Військові з Миколаєва зняли пародію на пісню #NaatuNaatu з ?? фільму "RRR", … Read more

    చెన్నై మ్యాచ్ విన్నింగ్ క్షణాలు.. గూస్ బంప్స్

    చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నె గెలిచిన క్షణాలు గూస్ బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా ధోని మోములో ఆనందం, ఉబికి వస్తున్న అతని కంటతడి ప్రతి చెన్నై అభిమానిని కన్నీళ్లు పెట్టించింది. చివరి బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించిన జడేజాను ధోని అమాంతం హత్తుకుని కంటతడి పెట్టాడు. గ్రౌండ్‌లో తిరుగుతూ ప్రేక్షకులకు విజయానందాన్ని పంచాడు. అనంతరం గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను హత్తుకుని ఓదార్చాడు. మరోవైపు గ్రౌండ్‌లో చిన్న పిల్లల మాదిరి చెన్నై ప్లేయర్లు ఆనందంతో కేరింతలు కొట్టారు. … Read more

    రిటైర్మెంట్‌పై ధోని కీలక ప్రకటన

    చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం.. ధోని తన రిటైర్మెంట్‌పై కీలక ప్రకటన చేశాడు. ‘ఇలాంటి ఉద్విగ్న క్షణాల్లో రిటైర్మెంట్ ప్రకటించడం చాలా తేలిక. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం తొమ్మిది నెలల పాటు శిక్షణ పొందాలనుకుంటున్నా. ఇది ఫ్యాన్స్‌కు నా నుంచి అందించే గిఫ్ట్. స్టేడియంలో మ్యాచ్ జరిగిన క్షణాలు మరవలేను. స్టేడియంలో ధోని, ధోని నినాదాలు నా కళ్లల్లో నీళ్లు తెప్పించాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. Thala happy and so are we ✨?pic.twitter.com/WfT3VybSUt — Chennai Super … Read more

    రాత్రికి రాత్రే నగరం రంగు మారింది

    ఇటలీ నగరం వెనిస్‌లో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది. నీటి నగరంగా పేరుగాంచిన వెనిస్‌లో గ్రాండ్‌ కెనాల్‌ నీటి రంగు.. రాత్రికి రాత్రే మారిపోయింది. బ్లూ కలర్‌లోని కాలువ రంగు గ్రీన్ కలర్‌లోకి మారిపోయింది. మరోవైపు సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. రంగు మారడంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాలువలో నాచు పెరిగిపోవడం వల్ల ఇలా జరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. The water in the Grand Canal in Venice has turned bright … Read more

    రామ్ సీతా రామ్ సాంగ్ విడుదల

    ఆదిపురుష్ సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. ‘రామ్ సీతారాం సీతారాం జయ జయరాం’ పాట రిలీజైంది. సాంగ్‌లో విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. రాముడు- సీత పాత్రల మధ్య పరిణయాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.

    GSLV F-12 ప్రయోగం సక్సెస్

    ఇస్రో ప్రయోగించిన GSLV F-12 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. GSLVF–12 రాకెట్‌ ద్వారా 2,232 కిలోల బరువు కలిగిన నావిక్‌–01 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. తాజా ప్రయోగం సక్సెస్‌తో స్వదేశీ నావిగేషన్ సిస్టం బలోపేతం కానుంది. ఈ ఉపగ్రహం పనితీరుతో భూ, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు తెలుసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో భూమిపై నావిగేషన్ సమాచారం అందించడం, వాహనచోదకులకు దిశానిర్దేశం చేయడం, ఇంటర్నెట్‌తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. #WATCH | Indian Space Research Organisation … Read more

    నింగిలోకి దూసుకెళ్లిన GSLV F-12

    శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముకుంటు GSLV F-12 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నిన్న ఉదయం మొదలైన కౌంట్ డౌన్ 10.46 నిమిషాలకు పూర్తై.. రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం రాకెట్ సవ్యమైన దిశలో సాగుతోందని శాస్త్రవేత్తల వెల్లడించారు. ఈ ప్రయోగం ద్వారా స్వదేశి నావిగేషన్ ఉపగ్రహం NVS-01ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. CONGRATULATIONS @isro !!#ISRO launches GSLV-F12 NVS-01 Mission from Satish Dhawan Space Centre (SDSC-SHAR), #Sriharikota Link – https://t.co/WuZWseMSdO pic.twitter.com/ysGHCZsb1d — … Read more