• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఉజ్జయిని ఆలయంలో కోహ్లీ- అనుష్క పూజలు

  [VIDEO](url): టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ దంపతులు ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కోహ్లీ, అనుష్కశర్మ కూర్చుని ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. గర్భగుడి ప్రధాన ద్వారం ఎదుట విరాట్‌ దంపతులు కూర్చుని ఉండగా వారి చుట్టూ భక్తులు కూర్చుని భజనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా విరాట్‌-అనుష్క జంట పూర్తి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. #WATCH | Madhya Pradesh: Actor Anushka Sharma & Cricketer Virat Kohli visit Mahakaleshwar temple in … Read more

  హృతిక్‌.. నువ్వో ఫైటర్..!!

  [VIDEO](url): బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ ‘ఫైటర్‌’ సినిమాలో నటిస్తున్నారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన హృతిక్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌కు కృతజతలు తెలిపారు.‘ఫైటర్‌’ సినిమా కోసం నాకు శిక్షణ ఇచ్చిన క్రిస్‌ గెతిన్‌ తిరిగి తన సొంత దేశానికి వెళ్తున్నాడు. వృత్తిపై మీకు ఉన్న నిబద్ధతకు నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ప్రపంచానికి మీలాంటి మనుషులు కావాలి’ అని అన్నాడు. దీనికి ట్రైనర్‌ స్పందిస్తూ ‘‘హృతిక్‌ ది … Read more

  మరోసారి గరిట పట్టిన బిల్‌గేట్స్‌

  [VIDEO](url): మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ మరోసారి చెఫ్‌గా మారారు. భారత్‌లో పర్యటిస్తున్న ఆయన.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి గరిట తిప్పారు. గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన సలహా మేరకు ఈసారి తృణధాన్యాలతో వంటకం చేసి దాన్ని రుచిచూశారు. అనంతరం ‘శ్రీ అన్న కిచిడీ’ని కొంతమంది చిన్నారులకు స్వయంగా తినిపించారు. ఈ వీడియో, ఫొటోలను స్మృతి ఇరానీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. Recognising the Super Food of India and its POSHAN … Read more

  అమెరికాలో మంచు తుపాను బీభత్సం!

  [VIDEO](url): అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా కాలిఫోర్నియా, టెక్సాస్‌, లూసియానా రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. కాలిఫోర్నియాలో కొన్ని అడుగుల ఎత్తు వరకు మంచు పేరుకుపోయింది. మంచు ప్రభావంతో చాలా చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. డాలస్‌కు రాకపోకలు సాగించే వందలాది విమానాలు రద్దయ్యాయి. టెక్సాస్‌లో గం.145కి.మీ వేగంతో గాలులు వీయోచ్చని అక్కడి వాతావరణ సంస్థ వెల్లడించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది. Brand new drone video from SkyView 30 shows all the snow at … Read more

  ‘VT13’లో హీరోయిన్‌గా మానుషి చిల్లర్‌

  [VIDEO:](url) మెగా హీరో వరుణ్‌ తేజ్‌ చేస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘VT13’ లో మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా చేస్తున్నట్లు మేకర్స్‌ తాజాగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను మూవీ యూనిట్‌ విడుదల చేసింది. షూటింగ్‌ కూడా ప్రారంభం కాబోతున్నట్లు అందులో పేర్కొంది. కాగా ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ ఫైటర్ పైలెట్‌గా కనిపించనున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోంది. Ready for take … Read more

  వివాహితతో సంబంధం.. అగ్నిపరీక్ష పెట్టిన కులపెద్దలు

  తెలంగాణ: ములుగు మండలం బంజెరుపల్లి గ్రామానికి చెందిన కులపెద్దలు ఆటవిక చర్యకు ఒడిగట్టారు. ఓ వ్యక్తి నిజాయతీని నిరూపించుకోవడానికి [అగ్నిపరీక్ష](url) పెట్టారు. జగన్నాథం గంగాధర్‌ ఒక వివాహితతో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ కులపెద్దలు పంచాయితీ నిర్వహించారు. సంబంధం లేదని నిరూపించుకునేందుకు అగ్నిలో కాలిన గడ్డపారను పట్టుకోవాలని గంగాధర్‌ను ఆదేశించారు. గాయాలైతే జరిమానాగా రూ.11 లక్షలు చెల్లించాలన్నారు. అయితే గాయాలు కాకున్నా కుల పెద్దలు వేధిస్తున్నారని గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ములుగులో ఆటవిక చర్య అక్రమ సంబంధం నెపంతో కాలుతున్న గడ్డ పారను పట్టుకోవాలని … Read more

  మహిళల ఐపీఎల్‌ ప్రచార మస్కట్‌ విడుదల

  [VIDEO:](url) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న మహిళల ఐపీఎల్‌కు సంబంధించి మస్కట్‌ విడుదలైంది. బీసీసీఐ కార్యదర్శి జైషా ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఒక చేత్తో బ్యాట్‌, మరో చేత్తో హెల్మెట్‌ పట్టుకొని రంగంలోకి దిగడానికి సిద్దంగా ఉన్న చీతాను అందులో చూపించారు. దానికి ‘శక్తి’ అని నామకరణం చేశారు. కాగా మహిళల ఐపీఎల్‌ ఈ నెల 4 నుంచి 26 వరకు ముంబైలో జరుగనుంది. మొదటి మ్యాచ్‌లో ముంబై, అహ్మదాబాద్‌ జట్లు తలపడనున్నాయి. #WATCH | BCCI … Read more

  రామ్‌చరణ్‌ ఫేవరెట్‌ మూవీస్‌ ఏంటో తెలుసా?

  [VIDEO:](url) ‘RRR’ చిత్రం ద్వారా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో అమెరికాలోని ప్రముఖ సోషల్‌ మీడియా సైట్‌ ‘లెటర్‌బాక్స్డ్‌’ చెర్రీతో ఆన్‌లైన్‌ ఇంటర్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ తనకు ఇష్టమైన సినిమాల గురించి తెలిపారు. హాలీవుడ్‌లో నోట్‌బుక్, టెర్మినేటర్‌ 2, గ్లాడియేటర్, ఇన్‌గ్లోరియస్‌ బాస్టర్డ్స్‌ సినిమాలు చాలా ఇష్టమని చెప్పారు. భారతీయ సినిమాల్లో ధాన వీర శూర కర్ణ, మిస్టర్‌ ఇండియా, బాహుబలి, రంగస్థలం తన ఫేవరేట్స్‌ అని తెలిపారు. Ahead of #RRRMovie returning to … Read more

  ‘దోస్త్‌ మేరా దోస్త్‌’ అంటున్న యువకుడు-కొంగ

  [VIDEO:](url) ఆపదలో తనను కాపాడిన యువకుడితో ఓ కొంగ స్నేహం చేస్తోంది. ఎక్కడికెళ్లినా నీ వెంటే అంటూ అతడితోనే తిరుగుతోంది. యూపీలోని మండ్కా గ్రామానికి చెందిన మహ్మద్‌ ఆరిఫ్‌ గతేడాది ఆగస్టులో గాయంతో ఉన్న కొంగను చూశాడు. ఇంటికి తీసుకెళ్లి తనకు తోచిన వైద్యం చేశాడు. నెలరోజుల పాటు ఇంట్లో ఉంచి దాని బాగోగులు చూసుకున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న కొంగ అప్పటినుంచి ఆరీఫ్‌తోనే ఉంటోంది. కొంగ ఇంతలా ప్రేమ చూపిస్తుందని అసలు అనుకోలేదని ఆరీఫ్‌ అన్నాడు. ఇంట్లో మనిషిలా కలిసిపోయిందని పేర్కొన్నాడు. … Read more

  అమ్మాయిని కొట్టిన యువకుడిపై నాగశౌర్య ఫైర్‌

  [VIDEO: ](url)రోడ్డుపై అమ్మాయిని ఎందుకు కొట్టావ్‌ అంటూ ఓ యువకుడిపై హీరో నాగశౌర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పాలంటూ సదరు కుర్రాడిని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఈమె నా లవర్‌’ అంటూ యువకుడు చెబుతుంటే.. అయితే సారీ చెప్పు, రోడ్డుపై ఆమెను ఎందుకు కొట్టావ్‌? అని శౌర్య డిమాండ్ చేశాడు. స్థానికులు సైతం సారీ చెప్పాలంటూ ఆ యువకుణ్ని పట్టుబట్టారు. నాగశౌర్య చేసిన పనిని సమర్థిస్తూ పలువురు నెటిజన్లు, అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. Matter … Read more