ఇంటిని అందంగా తీర్చిదిద్దే అనేక ప్రత్యామ్నాయాలు మార్కెట్‌లోకి వచ్చాయి. పెయింటింగ్, ఫ్లవర్‌వాజ్‌లు ఇలా ఎన్నో విభిన్నమైన వస్తువులు మీ ఇంటిని సుందరంగా మార్చడంలో ఉపయోగపడతాయి. అయితే కొందరు సంప్రదాయత ఉట్టిపడేలా గ్రీనరి లుక్‌తో తమ ఇళ్లను అందంగా మార్చాలని భావిస్తుంటారు. అటువంటి వారికి ‘ఫ్లవర్ పాట్స్’ మెుదటి ప్రాధాన్యం అని చెప్పవచ్చు. ఇవి ఇంటికి అలంకరణగా ఉండటమే కాకుండా మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బెస్ట్ ఫ్లవర్ పాట్ డిజైన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
Flower Pot Stand Design
ఈ ఫ్లవర్‌పాట్ స్టాండ్ సాలిడ్ మెటల్‌తో తయారైంది. దీనిపై రంగుల రంగుల పూల కుండీలను పెట్టడం ద్వారా ఆకర్షణీయమైన లుక్‌ను పొందవచ్చు. లివింగ్ రూమ్, ఇన్‌డోర్ – ఔట్‌డోర్ బాల్కనీలలో పెట్టవచ్చు. తద్వారా ఆ ప్రాంతాన్ని మినీ గార్డెన్‌గా మార్చేయవచ్చు.
Flower Pot Stand Design Outdoor
ఇంటి మూలల్లో అందమైన స్టాండింగ్ ఫ్లవర్ పాట్‌ను కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. ఇది నిటారుగా ఉండటం వల్ల కొద్ది స్థలాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఇంటి ఔట్‌డోర్‌లో దీన్ని పెట్టుకుంటే బెటర్. ఎండ, వాన, మంచులోనూ దెబ్బతినకుండా ఈ ఫ్లవర్ పాట్ స్టాండ్‌ను డిజైన్ చేశారు.
Living Room Flower Pot
సింపుల్ & గుడ్ లుకింగ్ పూల కుండీని కోరుకునే వారికి ఇది మంచి అప్షన్. దీనిని లివింగ్ రూమ్, హాల్, కిచెన్, ఔట్‌డోర్ ఇలా ఎక్కడైన ఏర్పాటు చేసుకోవచ్చు. చూడచక్కని రంగుల్లో ఉన్న ఈ కుండీలో అందమైన మెుక్కను ఉంచడం ద్వారా మీ ఇంటి అందాన్ని అమాంతం పెంచుకోవచ్చు.
Plastic Flower Pot Design
మట్టి కుండీల బదులుగా ప్లాస్టిక్ ఫ్లవర్ పాట్ కోరుకునే వారు దీనిని పరిశీలించవచ్చు. నాలుగు కుండీలను ఒక సెట్‌గా పొందవచ్చు. నీలం, నలుపు, గోల్డ్, ఆకుపచ్చ, పర్పుల్ తదితర రంగుల్లో ఈ కుండీలు అందుబాటులో ఉన్నాయి.
Wrought Iron Flower Pot Stand Design
స్టాండింగ్ పొజిషన్‌లో మంచి ఫ్లవర్ పాట్ డిజైన్‌ను కోరుకునే వారు దీన్ని ట్రై చేయవచ్చు. దీనిని ఇంటి వెలుపల, లోపల ఎక్కడైన ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ స్టాండ్ ఐరన్‌తో తయారైంది. ఇంటి పరిసరాల్లో చిన్నపాటి ఆకర్షణీయమైన గార్డెన్‌ను కోరుకునే వారికి ఇది మంచి ఛాయిస్.
Ceramic Flower Pot Design
కొందరు ఇంట్లోని టేబుల్స్‌ను అందమైన ఫ్లవర్ పాట్స్‌తో డెకరేట్ చేయాలని భావిస్తుంటారు. అలా భావించే వారు దీన్ని ట్రై చేయండి. ఇది టేబుల్‌కు కొత్త దనాన్ని తీసుకొస్తుంది.
Wooden Flower Pot Stand Design
ఇది చెక్కతో చేసిన ఫ్లవర్ పాట్ స్టాండ్. ఇది ఇంటికి చాలా నేచురల్ లుక్‌ను తీసుకొస్తుంది. నాణ్యమైన చెక్కతో ఈ స్టాండ్‌ను తయారు చేయడం వల్ల కుండీలు స్థిరంగా ఉంటాయి. దీన్ని ఇండోర్, ఔట్‌డోర్, లివింగ్ రూమ్ ఎక్కడైన ఏర్పాటు చేసుకోవచ్చు.
Bamboo Flower Pot Design
ఇది హస్తకళలో భాగంగా పర్యవరణ హితంగా తయారైంది. వెదురు బొంగులతో దీన్ని చేశారు. ఔట్‌డోర్, ఇండోర్ అనే తేడా లేకుండా ఇంట్లో ఎక్కడైన ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బాంబో ఫ్లవర్ పాట్ మీ ఇంటికి యునిక్ లుక్ తీసుకొస్తుంది.
Flower Pot Stand Design For Garden
ఇది మీ అందమైన మెుక్కలను ఎలివేట్ చేయడంతో పాటు ఇంటికి సుందరమైన లుక్‌ను తీసుకొస్తుంది. ముఖ్యంగా ఇంటి బాల్కనీలో దీన్ని ఏర్పాటు చేయవచ్చు. ఎండ, వాన, మంచును తట్టుకునేలా ప్రీమియం మెటల్‌తో ఫ్లవర్ పాట్ స్టాండ్‌ను తయారు చేశారు.
Wall Flower Pot Design
ఇంటి గోడను అందంగా తీర్చిదిద్దే ఫ్లవర్ పాట్ డిజైన్ కావాలనుకుంటే దీన్ని ట్రై చేయవచ్చు. దీనిని లివింగ్ రూమ్, బాల్కనీ, బెడ్‌రూమ్ ఇలా ఇంట్లో ఎక్కడైన ఏర్పాటు చేసుకోవచ్చు. ఆఫీసు కార్యాలయాల్లోనూ ఈ Wall Flower Potను ట్రై చేయవచ్చు.
Bottle Plant Pot Design
ఈ బాటిల్ ప్లాంట్ పాట్.. సింపుల్‌గా ఉండటంతో పాటు చూపరులను వెంటనే ఆకర్షిస్తుంది. దీనిని ఇంటిలోని కిటికీల వద్ద, కిచెన్ ఇలా నచ్చిన ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవచ్చు.
Designer Flower Pot Design
డిజైనర్ ఫ్లవర్ పాట్ కోరుకునేవారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది. ఆరెంజ్ కలర్‌లో ఉండే ఈ రెండు డిజైనర్ కుండీలు మీ ఇంటికి మంచి లుక్‌ను అందిస్తాయి. ఇండోర్, ఔట్‌డోర్, ఆఫీసుల్లోనూ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.