• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంగళూరులో పేలిన ఆటో

    [VIDEO](url): కర్ణాటకలోని మంగళూరులో ఆటో పేలుడు కలకలం రేపింది. ఇవాళ ఉదయం అనుమానస్పద రీతిలో ఆటో పేలింది. బ్లాస్ట్‌కు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రమాదమా లేక ఉగ్ర కుట్రనా అన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఉగ్ర కుట్రగానే అనుమానిస్తున్నామన్న పోలీసులు… దీనిపై ముమ్మర దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం బృందాలు కూడా దర్యాప్తులో పాల్గొంటాయని ఆ రాష్ట్ర హోం మంత్రి జ్ఞానేంద్ర చెప్పారు. #BreakingNews | Blast not an accident, but an act of … Read more

    బ్యాగ్‌తో ఆఫ్తాబ్; సీసీటీవీ ఫుటేజ్ వైరల్

    శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలకు చెందిన ఓ సీసీటీవీ ఫుటేజ్ బయటికొచ్చింది.[ వీడియో](url)లో ఆఫ్తాబ్ బ్యాగ్ తగిలించుకుని ఓ వీధిలో తెల్లవారుజామున 4.01 గంటలకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ వీధి సమీప అటవీ ప్రాంతానికి వెళ్లే మార్గమని తెలుస్తోంది. ఈ వీడియో అక్టోబర్ 18న రికార్డ్ అయినట్లు సమాచారం. కాగా శ్రద్ధా శరీర భాగాలను పారేసేందుకు ఆఫ్తాబ్ ఈ బ్యాగ్‌ను ఉపయోగించుకున్నట్లు అనుమానిస్తున్నారు. బ్యాగ్ వేసుకుని అక్కడే రెండు మూడు రౌండ్లు వేసినట్లు గుర్తించారు. CCTV footage of … Read more

    రేసింగ్ కార్లతో దద్దరిల్లిన భాగ్యనగరం

    హైదరాబాద్‌లో రేసింగ్ కార్లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లాయి. హుస్సేన్ సాగర్ తీరంలో స్ట్రీట్ సర్క్యూట్‌పై రేసింగ్ కార్లు పరుగులు పెట్టాయి. సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు రేసింగ్ కొనసాగింది. ఈ రేసింగ్‌లో 12 కార్లు దౌడు తీశాయి. పెట్రోల్ కార్లు 240 కి.మీ స్పీడ్‌తో, ఎలక్ట్రిక్ కార్లు 320 కి.మీ వేగంతో పరుగులు తీశాయి. హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు, గోవా, చెన్నై బృందాలు రేసింగ్‌లో పాల్గొన్నాయి. [రేసింగ్‌](url)ను వీక్షించడానికి ప్రేక్షకులు భారీ ఎత్తున తరలివచ్చారు. Hyderabad Racing ? … Read more

    గర్భిణీగా హారిక ప్రయాణం స్ఫూర్తిదాయకం

    చెస్ ఛాంపియన్ ద్రోణవల్లి హారిక తను గర్భవతిగా ఉన్నప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చే వరకు తన ప్రయాణాన్ని సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంది. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచేలా [వీడియో](url) రూపొందించింది. మూడో నెలలో ల్యాప్ టాప్ లో చెస్ ఆడుతూ …4,5 నెలల్లో కోచింగ్ తీసుకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎనిమిదో నెల ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించుకోగా…9వ నెలలో నిండు గర్భిణీగా ఉండి చెస్ ఒలింపియాడ్ ఆడి గెలిచింది. ఆగస్టు 24న పాపకు జన్మనిచ్చింది. View this post on Instagram A post shared … Read more

    జైలులో మంత్రికి మసాజ్

    మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన దిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కు తీహర్ జైలులో సకలభోగాలు అందుతున్నట్లు తెలుస్తోంది. ఆయన జైలులో ఏకంగా మసాజ్ చేయించుకుంటున్న[ వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జైన్ కు అక్కడ ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని, వీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపిన కొన్ని రోజులకే వీడియో బయటకు వచ్చింది. భాజపా నేత షెహజాద్ పూనావాలా ఈ వీడియోను షేర్ చేశారు. నిబంధనలు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. So instead of Sazaa – Satyendra … Read more

    10వేల అడుగుల ఎత్తులో స్కై డైవింగ్

    [VIDEO:](url) ఆర్మీ ఉద్యోగిని లాన్స్ నాయక్ మంజు అరుదైన ఘనత సాధించారు. 10వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి రికార్డు సృష్టించారు. ఏఎల్‌హెచ్ ధ్రువ హెలికాప్టర్‌లో మంజు ఇద్దరు స్కై డైవర్లతో కలిసి నింగిలోకి ఎగిరారు. 10వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాక అక్కడి నుంచి జంప్ చేశారు. పారాచూట్ సహాయంతో నేలపై సురక్షితంగా దిగారు.. దీంతో భారత సైన్యంలో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా మంజు నిలిచారు. ‘తన రెక్కలపై విశ్వాసముంచితే పక్కి ఆకాశపు హద్దుల్ని చూడగలదు’ అని మంజు … Read more

    దేశ చరిత్రలోనే అత్యంత క్రూరమైన కేసు

    దిల్లీలో శ్రద్ధా హత్య ఘటన స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన, కిరాతకమైన, అమానవీయ ఘటన అని లాయర్‌ సార్థక్‌ నాయక్‌ అభిప్రాయపడ్డారు. తనతో సహజీవనం చేస్తున్న యువతిని చంపి 35 భాగాలుగా కోసిన ఈ ఘటనపై ‘టైమ్స్‌నౌ’ నిర్వహించిన డిస్కషన్‌లో ఆయన ఈ విషయాలు చెప్పారు. శ్రద్ధ, అఫ్తాబ్‌ చివరిసారి ఎక్కడ కనిపించారు? శ్రద్ధ హత్య తర్వాత అఫ్తాబ్‌ ఎవరెవరిని కలిశారు?, శ్రద్ధను హత్య చేసిన ఆయుధం..తదితరాలు తెలుసుకుంటే కేసును ఛేదించడం సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

    LIVE: సూపర్‌ స్టార్‌ కృష్ణకు అంతిమ వీడ్కోలు

    సూపర్‌ స్టార్‌ కృష్ణకు అభిమానులు తుది వీడ్కోలు పలుకుతున్నారు. పద్మాలయా స్టూడియోస్‌లో తమ అభిమాన హీరో కడచూపు కోసం భారీగా తరలివెళ్తున్నారు. మధ్యాహ్నం వరకు అభిమానుల కోసం కృష్ణ పార్దివదేహాన్ని పద్మాలయా స్టూడియోస్‌లో ఉంచుతారు. మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.

    వాహనదారులకు గుడ్‌ న్యూస్‌

    సొంత వాహనాల్లో ఇతర రాష్ట్రాలకు విహారయాత్రలకు వెళ్లాలనుకునేవారికి ఆయా రాష్ట్రాల ఛార్జీలు, సెస్సుల మోత భరించాల్సి ఉంటుంది. అయితే ఇకపై దీని నుంచి విముక్తి లభించనుంది. 10 సీట్లలోపు అన్ని వాహనాలకు ఆలిండియా పర్మిట్‌ ఇచ్చేలా నిబంధనలు మారుస్తూ కేంద్రం ముసాయిదా విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 10 రోజుల్లో పర్మిషన్‌ వస్తుంది. పర్మిట్‌ ఫీజులు **వాహనం ** ** వార్షిక ఫీజు** **త్రైమాసిక ఫీజు** 5గురి లోపు రూ.20000 రూ.6000 510 మంది రూ.30000 రూ.9000 1020 మంది రూ.80000 రూ.24000 … Read more

    ఉత్సాహంగా జోడో యాత్ర

    కాంగ్రెస్‌ పార్టీని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర నాందేడ్‌లోని అర్ధాపూర్‌లో రాహుల్‌ [పాదయాత్ర](url) ప్రారంభించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి నడుస్తున్నారు. యాత్రలో భాగంగా ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. భాజపా పాలనలో ఎవ్వరికి మేలు జరగలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని వివరిస్తున్నారు. #WATCH | Congress MP Rahul Gandhi, along with party leaders & workers, resumes the 'Bharat Jodo Yatra' from Ardhapur, … Read more