• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అంబులెన్సుకి దారిచ్చిన ప్రధాని

    అంబులెన్స్‌కి దారి ఇవ్వడానికి ప్రధానమంత్రి కాన్వాయ్‌ని పోలీసులు ఆపేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కంగ్రా నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం తన కాన్వాయ్‌ని నిలిపి అంబులెన్సు కోసమని దారిచ్చారు. అంబులెన్సు వెళ్లిపోగానే ప్రజలకు ప్రధాని కారులో నుంచే అభివాదం చేస్తూ అక్కడి నుంచి బయలుదేరారు. ఈ [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలోనూ ప్రధాని ఇలా అంబులెన్సుకి దారిచ్చారు. #WATCH | Prime Minister Narendra Modi stopped his convoy to let … Read more

    అడుగు వేయలేకున్నా నెట్‌ సాధించింది

    తన పట్టుదలతో అంగవైకల్యాన్ని ఆమడ దూరాన నిలబెట్టింది. సాయం లేనిదే అడుగైనా వేయలేని ఆమె..జీవితంలో అతిపెద్ద అడుగు వేసింది. జాతీయ అర్హత పరీక్ష (NET)లో 99.31 శాతం స్కోర్‌ సాధించి ఔరా అనిపించింది. పశ్చిమ బెంగాల్‌ నదియా జిల్లాలోని శాంతిపూర్‌కు చెందిన పియాషా మహల్దార్‌ దివ్యాంగురాలు. 3 అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది. తాను కదల్లేకపోయినా చిన్ననాటి నుంచి చదువంటే ఆసక్తి. యూజీసీ నెట్‌ను కంప్యూటర్‌ ముందు బోర్లా పడుకుని రాసి, బెంగాలీ విభాగంలో 99.31 శాతం స్కోర్‌ సాధించింది.

    కంటతడి పెట్టిన ఎమ్మెల్యే

    ఒక్కసారి శాసనసభ్యుడిగా గెలిస్తేనే కోట్లు సంపాదించుకుంటున్న రోజుల్లో ప్రభుత్వ భవనం ఇచ్చినందుకు ఓ ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకున్నారు. బిహార్‌లోని అలౌలి నియోజకవర్గం నుంచి గెలిచిన రామ్‌ వృక్ష్‌…ఇందిరా ఆవాస్‌ యోజన ఇంటిలోనే నిన్నమెున్నటివరకు ఉన్నారు. ప్రభుత్వం ఆయనకు పట్నాలో అధికారిక గృహ సముదాయంలో ఇంటిని కేటాయించగా..తాళాలు అందుకుంటూ [భావోద్వేగానికి](url) లోనయ్యారు. పేదలకు ఏదైనా దొరికిన రోజే వారికి అది దీపావళి అని పేర్కొన్నారు. This is RJD MLA Ram Vriksh Sada from Bihar who just got a house as … Read more

    అడ్వాణీని కలిసిన ప్రధాని మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ భాజపా సీనియర్‌ లీడర్‌ ఎల్‌కే అడ్వాణీని కలిశారు. అడ్వాణీ పుట్టినరోజు పురస్కరించుకొని దిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని వెంట కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూాడా వెళ్లారు. ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించారు. అడ్వాణీని మోదీ [కలవటం](url) పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi visited the residence of veteran BJP … Read more

    రాహుల్‌గాంధీపై కాపీరైట్ కేసు

    కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై ఎంఆర్‌టీ మ్యూజిక్ కంపెనీ కాపీ రైట్ కేసు పెట్టింది. రాహుల్ తన ఎలివేషన్ కోసం కేజీఎఫ్2 పాటలు వాడుతున్నారని, ఇది కాపీరైట్ ఉల్లంఘన అవుతుందని అందుకే కేసు పెట్టామని తెలిపింది. రాహుల్‌తో పాటు జైరాం రమేష్, సుప్రియా శ్రీనటేలపై కూడా కేసు పెట్టారు. ఈ మేరకు ఎంఆర్‌టీ సంస్థ బెంగళూరు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా కేజీఎఫ్2 పాటలను [వీడియో](url)ల్లో వాడారని తెలుస్తోంది. MRT Music, … Read more

    నాకు 4 బుల్లెట్లు తగిలాయి: ఇమ్రాన్‌ ఖాన్‌

    పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై జరిగిన కాల్పులపై ఆయన తొలిసారి స్పందించారు. కాలుకు పట్టీ కట్టుకుని ఆయన మాట్లాడారు. తనకు నాలుగు బుల్లెట్లు తగిలాయని ఆయన చెప్పారు. వజీరాబాద్‌లో లేదంటే గుజ్రాత్‌లో తనను చంపాలని చూస్తున్నారని తనకు ముందు రోజే తెలుసని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. ప్రభుత్వమే తనను చంపేందుకు కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ కాల్పుల ఘటనలో ఇప్పటికి ఒకరు మృతి చెందగా…13 మందికి గాయాలయ్యాయి.

    శివసేన నాయకుడు సిధ్దు సూరి హత్య

    పంజాబ్‌లో శివసేన నాయకుడు సిధ్దు సూరిపై పోలీసులు చూస్తుండగానే కాల్పులు([వీడియో](url)) జరిగాయి. అమృత్‌సర్‌లో ఈ ఘటన జరిగింది. సిద్ధూ మూసేవాలా తర్వాత పంజాబ్‌లో ఇదే మరో పెద్ద కాల్పుల ఘటన. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పిస్తోలును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల భద్రత ఉండగానే నిందితుడు కాల్పులు జరిపాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే సిద్ధూ సూరి ప్రాణాలు కోల్పోయారు. మృతుడిపై గతంలో అనేక కేసులు ఉన్నాయి. మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసుల్లో జైలు జీవితం కూడా గడిపారు. Punjab #Live : Shiv Sena … Read more

    హైవేపై చాయ్ తాగిన సచిన్

    మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ రిటైరయ్యాక చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వినూత్న రుచుల కోసం బెలగాం- ముంబయి హైవేపై అన్వేషిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఓ దాబా వద్ద ఆగి.. చాయి, టోస్ట్ తీసుకున్నారు. అవి తింటుండగా తనవైపే చూస్తున్న తనయుడు అర్జున్‌‌ని పిలిచి కావాలా అని అడిగారు. ఈ ఛాయ్, టోస్ట్ ఎంతో బాగుందని సచిన్ సంతృప్తి చెందారు. అనంతరం దాబా యజమానితో ఓ సెల్ఫీ తీసుకుని అక్కడినుంచి పయనమయ్యారు. తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో సచిన్ ఈ [వీడియో](url)ను పోస్ట్ చేయగా.. నెట్టింట … Read more

    మునుగోడులో TRS,BJP రాళ్లదాడి

    మునుగోడులో పలివెలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రచారానికి చివరి రోజైన నేడు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. ప్రచారానికి వెళ్లిన ఈటల కాన్వాయ్‌పైనా రాళ్లతో దాడి చేశారు. పోలీసులు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. తన గన్‌మెన్లు, కార్యకర్తలు గాయపడ్డారని, 10-15 కార్లు ధ్వంసం చేశారని అయినా పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారని ఈటల ఆరోపించారు. ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనం పాటించామన్నారు.

    గుజరాత్‌లో కూలిన కేబుల్ బ్రిడ్జి

    గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తీగల వంతెన నదిలో కూలడంతో సుమారు 100మందికి పైగా నదిలో పడిపోయారు. ప్రమాదం జరిగే సమయంలో వంతెనపై 500మంది ఉన్నట్లు సమాచారం. కాగా, సామర్థ్యానికి మించి సందర్శకుడు వంతెనపైకి చేరుకోవడమే ఇందుకు కారణమైనట్లు తెలుస్తోంది. చిన్నారులు, మహిళలు ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాలని సీఎంకు ఆదేశించారు. गुजरात के मोरबी में केबल पुल टूट गया। करीब 400 लोग नदी … Read more