• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం

    ఈజిప్టు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌’ దక్కింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి దీనిని అందజేసి సత్కరించారు. 1915లో ప్రారంభించిన ఈ పురస్కారాన్ని, మానవాళికి విశేష సేవలందించే నేతలకు అందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి ఇది 13వ పురస్కారం కావడం విశేషం. మరోవైపు ఈ పర్యటనలో 11వ శతాబ్దం నాటి అల్‌- హకీం- మసీదును ప్రధాని సందర్శించారు. అలాగే ప్రసిద్ద గిజా పిరమిడ్లను వీక్షించారు. Prime Minister @narendramodi visits … Read more

    Janasena Strategy: ఏపీలో హంగ్ తప్పదా? పవన్ కళ్యాణ్ వ్యూహం ఇదే!.. దారిలోకి వస్తున్న టీడీపీ

    ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కిందటిసారితో పోలిస్తే ఈ సారి ఎలక్షన్లు మరింత రసవత్తరంగా మారనున్నాయి. టీడీపీ, వైసీపీలే కాకుండా జనసేన పార్టీ కూడా ఎన్నికల కురుక్షేత్రంలోకి దూసుకొస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగుతున్నారు. వారాహి యాత్రతో అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేసేందుకు పవన్ ట్రై చేస్తున్నారు. దీంతో ఏపీలో హంగ్ తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి, పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? జనసేనాని ప్లాన్‌తో టీడీపీ దారిలోకి వస్తుందా? అనే విషయాలను … Read more

    మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌: మోదీ

    ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. అమెరికా ప్రతినిధుల సభలో మాట్లాడిన ప్రధాని, పరోక్షంగా పాకిస్థాన్​కు చురకలంటించారు. భారత్​ ప్రస్తుతం 5వ ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలోనే 3వ స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు వైట్​హౌస్​లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఏర్పాటు చేసిన విందుకు ప్రధాని మోదీ సహా వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా హాజరయ్యారు. గూగుల్‌ సీఈఓ సుందర్ పిచ్చాయ్‌ కూడా విందులో పాల్గొన్నారు. #WATCH | Our vision is 'Sabka … Read more

    KTR as CM: వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా కేటీఆర్… వ్యూహం మార్చిన కేసీఆర్!

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో రాజకీయం వేడెక్కింది. అధికార, విపక్షాలు ఎన్నికల సమరానికి మెల్లిమెల్లిగా రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో క్యాడర్ బలోపేతంపై బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్ పెట్టాయి. మరోవైపు, ఇదే ఊపును కొనసాగించాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. అయితే, బీఆర్ఎస్‌లో సీఎం అభ్యర్థిత్వంపై తరచూ చర్చ జరుగుతూ వస్తోంది. సీఎం కేసీఆరే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని కొందరు చెబుతుండగా, ఇతర నాయకులు, కొందరు మంత్రులు మాత్రం కేటీఆర్ పేరు వల్లిస్తున్నారు.  మంత్రి పువ్వాడ కామెంట్స్.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ … Read more

    బైడెన్‌ భార్యకు మోదీ అదిరిపోయే గిఫ్ట్‌!

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బైడెన్​ దంపతులు ఇచ్చిన ఆతిథ్యాన్ని మోదీ స్వీకరించారు. ఈ క్రమంలో పురాతన అమెరికన్‌ బుక్‌ గ్యాలీతో పాటు పాతకాలపు అమెరికన్ కెమెరాను మోదీకి బైడెన్‌ బహూకరించారు. మరోవైపు జిల్ బైడెన్‌కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారు. అనంతరం ఇరువురూ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. వైట్​హౌస్​లో ప్రవేశించే ముందు బైడెన్​ దంపతులు, మోదీ ఫొటోలకు పోజులిచ్చారు. #WATCH | Prime Minister … Read more

    TS: ఎమ్మెల్యేను నిలదీసిన కన్నకూతురు

    తెలంగాణలోని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కన్న కూతురే నడిరోడ్డుపై నిలదీసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ముత్తిరెడ్డిని ఆయన కుమార్తె తుల్జా భవానీ ఓ స్థలం విషయమై నలుగురిలో నిలదీసింది. దీనిపై ఎమ్మెల్యే స్పందించారు. తన కూతురిని రాజకీయ ప్రత్యర్ధులు తనపైకి ఉసిగొల్పారని మండిపడ్డారు. ఆమెను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. రోడ్డు మీదనే నిలదీసిన ఎమ్మెల్యే కూతురు#MLA #Muttireddy #daughter #Telangana #Warangal #DishaTV #DishaTvTelugu pic.twitter.com/Nu9UYtxn9y — Disha … Read more

    ఎంపీ నిధులతో ఇల్లు కట్టుకున్నా: బీజేపీ ఎంపీ

    ఎంపీ నిధులతో తాను ఇల్లు కట్టుకున్నానని ఆదిలాబాద్ బీజేీపీ ఎంపీ సోయం బాపూరావ్ తెలిపారు. ‘‘ఎంపీ ల్యాడ్స్ నిధులతో నేను ఇల్లు కట్టుకుంటే తప్పేంటి. అందుకే సొంత అవసరాలకు వాడుకున్నా. సొంత ఇల్లు లేకపోతే గౌరవం ఉండదు. అందుకే ఎంపీ నిధులతో ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇంట్లోనే నా కుమారుడికి పెళ్లి చేశాను. అభివృద్ధి కోసం నిధులు పంచకపోవడం తప్పే. గతంలో ఉన్న ఎంపీల మాదిరిగా నేను నిధుల గోల్‌మాల్‌కు పాల్పడలేదు.’’ అంటూ ఎంపీ బాపూరావ్ చెప్పుకొచ్చారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో నేను ఇల్లు … Read more

    సభకొస్తారు.. కానీ ఓటెయ్యరు: పవన్

    AP: కాకినాడలో వారాహి యాత్ర సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున సభకు వస్తారు కానీ ఓటెందుకు వేయట్లేదో అర్థం కావట్లేదన్నారు. సినిమా టికెట్ కోసం క్యూ లైన్లలో వేచి ఉండే ఓపిక ఓటు వేసేందుకు ఎందుకు ఉండట్లేదని ఆయన నిలదీశారు. ఏపీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని లోతుగా అర్థం చేసుకోవాలన్నారు. జనవాణిలో కాకినాడ సమస్యలు వింటుంటే చాలా బాధ కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాగా మార్చేశారని ఆరోపించారు. సినిమా … Read more

    స్టెప్పులతో అదరగొట్టిన మల్లారెడ్డి

    తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో మరోమారు హల్‌చల్‌ చేశారు. తన డ్యాన్స్‌తో అందరినీ ఉత్సాహపరిచారు. మేడ్చల్‌ జిల్లా ఫిర్జాదిగూడలో నిర్వహించిన తెలంగాణ రన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ఫుల్‌ జోష్‌తో స్పెప్పులు వేశారు. దీంతో అక్కడి వారంతా కేరింతలు కొడతూ మంత్రిని ఉత్సాహపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. డీజే టిల్లు పాటకి డాన్స్ వేసిన మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ రన్ డే … Read more

    TS: మంత్రికి తప్పిన ప్రమాదం

    తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రమాదం తప్పింది. తెలంగాణ ‘చెరువుల పండుగ’ సందర్భంగా కమలాకర్ కరీంనగర్ జిల్లాలోని ఆసిఫ్ నగర్‌లోని ఓ చెరువు సందర్శనకు వెళ్లారు. చెరువులో ఆయన పడవపై ప్రయాణిస్తుండగా అది బోల్తా పడింది. దీంతో కమలాకర్ నీటిలో పడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి ఆయనను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో మంత్రి సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. Minister and Karimnagar MLA Gangula Kamalakar escapes boat mishap, alert security rescues him … Read more