• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కన్నీళ్లు పెట్టుకున్న ముఖ్యమంత్రి

    ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కన్నీరు పెట్టుకున్నారు. తన సన్నిహితుడు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఓ స్కూల్ ప్రారంభోత్సవంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..‘‘సిసోడియాను ఎంతో మిస్ అవుతున్నా. విద్యాశాఖ మంత్రిగా ఆయన మరపురాని సేవలు అందించారు. ప్రతీ ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించాలన్నది ఆయన కల. అలాంటి వ్యక్తిని జైలులో పెట్టారు. తప్పుడు కేసులతో సిసోడయాను జైల్లో పెట్టారు.’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. Delhi CM @ArvindKejriwal breaks down remembering the contribution of … Read more

    నారా లోకేశ్‌పై కోడిగుడ్లతో దాడి!

    ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఏపీలోని ప్రొద్దుటూరులో జరిగింది. ప్రొద్దుటూరులో బహిరంగ సభ అనంతరం మైదుకూరు రోడ్డుమార్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర సాగించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి లోకేశ్‌పై కోడిగుడ్డు విసరగా భద్రతా సిబ్బందికి తగిలింది. కోడిగుడ్డు విసిరిన వ్యక్తిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కాగా ఈ ఘటనపై లోకేశ్ అక్కడే కూర్చుని నిరసనకు దిగారు. #WATCH | Andhra Pradesh | … Read more

    Telangana @ 10 Years: 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి దోహదపడిన 10 అంశాలు!

    తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. 2014 జూన్‌ 2న దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ 2023 జూన్‌ 2తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదో ఏట అడుగుపెట్టబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ ప్రాంతం.. ప్రస్తుతం ప్రగతిలో దేశానికే ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు హైదరాబాద్‌ మినహా తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి కనిపించేది కాదు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కరెంటు లేని ఇళ్లే కనిపించేవి. నీరు లేక ఏడారిని తలపించే భూములు తారసపడేవి. కొత్త … Read more

    రాహుల్ సభలో ఖలీస్థానీల హల్‌చల్

    కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సభలో ఖలీస్థానీ మద్ధతుదారులు హల్‌చల్ చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఓ సమావేశంలో రాహుల్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఖలీస్థానీ మద్ధతుదారులు నినాదాలు చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే రాహుల్ స్పందిస్తూ ‘‘విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణాలు’’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Rahul Gandhi heckled for the 1984 Sikh genocide (unleashed by the Congress), in America… ऐसी नफ़रत … Read more

    కవిత, సంజయ్‌ల ఆత్మీయ పలకరింపు

    తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ ఉప్పు నిప్పుగా ఉండే టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు ఆత్మీయంగా పలకరించుకున్నారు. నిజామాబాద్‌లోని ఓ బీజేపీ నేత గృహ ప్రవేశానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఎదురై కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, జిల్లా జడ్పీ చైర్మన్ విఠల్‌రావును సంజయ్‌కు కవిత పరిచయం చేశారు. బండి సంజయ్, కవిత ఎదురుపడిన వేళ.. | MLC Kavitha | Bandi Sanjay … Read more

    మోదీజీ దేవుడికే పాఠాలు చెబుతారు: రాహుల్

    ప్రధాని మోదీ భారత ప్రజలను భయపెడుతున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ అక్కడి ప్రవాస భారతీయులతో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారు. అంతా తమకే తెలుసనుకునే వారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. చరిత్రకారులకే చరిత్ర చెప్పేలా, సైన్యానికే యుద్ధం నేర్పేలా చేస్తారు. చివరికి దేవుడికి కూడా పాఠాలు చెప్పేలా తయారయ్యారు. అలాంటి వారిలో ఒకరు మోదీ’ అంటూ కాలిఫోర్నియాలో జరిగిన మీటింగ్‌లో రాహుల్ విరుచుకు పడ్డారు. Just listen the speech of Mr #RahulGandhi "Santa … Read more

    రెజ్లర్లపై ప్రశ్న.. పరుగందుకున్న కేంద్రమంత్రి

    రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలంటూ గత కొన్ని రోజులుగా స్టార్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని ఓ రిపోర్టర్‌ ప్రశ్నించారు. ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న మంత్రిని రెజ్లర్ల గురించి అడిగారు. రిపోర్టర్‌ ప్రశ్నకు ఏమాత్రం స్పందించని కేంద్ర మంత్రి అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. తన కారు వైపు పరుగులు తీశారు. ఈ క్రమంలో రిపోర్టర్‌ కూడా మంత్రి వెంట పరిగెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ షేర్ … Read more

    Sengol: దేశంలో కాకరేపుతున్న ‘రాజదండం’.. పార్లమెంటు ప్రారంభోత్సవానికి దానికి లింకేంటి?

    పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం వేళ ‘రాజదండం (సెంగోల్‌)’ చర్చనీయాంశమైంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వివాదానికి కారణమైంది.  బ్రిటిషర్ల నుంచి భారత్‌కు బదిలీ అయిన అధికారాలకు ఈ రాజదండం ప్రతీక అని కేంద్రం చెప్తుండగా.. అందుకు లిఖితపూర్వకమైన ఆధారాలు లేవని కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో వాద ప్రతివాదనలకు కారణమైన రాజదండం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాజదండానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. అది తెలియాలంటే 1947 సంవత్సరానికి వెళ్లాలి.అధికార బదిలీకి సిద్దమైన బ్రిటిష్‌ చివరి వైస్రాయ్‌ లార్డ్ మౌంట్ బాటన్ నెహ్రూతో … Read more

    WHO IS KARNATAKA CM: అసలు కథ ఇప్పుడే మెుదలైంది.. కౌన్ బనేగా కన్నడ సీఎం?

    ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. మెుత్తం 224 స్థానాలకు గాను136 గెలిచి విజయదుందిభి మోగించింది. అధికార భాజపా 64 సీట్లతో సరిపెట్టుకోగా JDS 20, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 114 మ్యాజిక్‌ ఫిగర్‌ను కాంగ్రెస్‌ అధిగమించడంతో ఆ పార్టీ తరపున సీఎంగా ఎవరు నిలబడతారన్నది ఆసక్తికరంగా మారింది. సీఎం రేసులో కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ D.K. శివకుమార్‌ (60), సీనియర్ నేత సిద్దరామయ్య (75)లు ఉన్నారు. వీరిలో ఒక్కరు మాత్రమే సీఎం … Read more

    భావోద్వేగానికి గురైన డీకే శివకుమార్

    కర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తున్న సందర్భంగా కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. అధికార బీజేపీ తనను జైలులో పెట్టినప్పుడు సోనియా గాంధీ తనకు అండగా నిలిచారని చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వారికి బహుమానంగా అందజేస్తున్నట్లు శివకుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ విజయానికి సహకరించిన ప్రతి ఒక్క నేతకు పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆయన చెప్పారు. కనకాపుర స్థానం నుంచి పోటీ చేసి శివకుమార్ గెలుపొందారు. #WATCH | Karnataka Congress President DK Shivakumar gets emotional … Read more