• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉద్రిక్తంగా YS షర్మిల నిరసన

    [VIDEO](url):హైదరాబాద్‌లో YSRTC అధినేత్రి షర్మిల నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న షర్మిల కారుపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై నిరసనగా ఆమె ఇవాళ అదే కారులో ప్రగతిభవన్‌ వైపు బయల్దేరారు. సోమాజిగూడ వద్ద అడ్డుకున్న పోలీసులు ఆమెను కారు దిగాలని కోరగా ఆమె అందుకు నిరాకరించారు. దీంతో కారును అలాగే టోవింగ్‌ బండికి కట్టి లాక్కెళ్లారు. SR నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాక ఆమెను బలవంతంగా కారులోంచి దింపి స్టేషన్‌లోకి తరలించారు. #WATCH | Hyderabad: Police drags away the … Read more

    నన్ను చంపుతారంటా: తెరాస కార్పొరేటర్

    హైదరాబాద్ ఉప్పల్ ఎమ్మెల్యే భేతీ సుభాష్ రెడ్డిపై సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. తనను అసభ్యంగా తిడుతూ చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపించారు. బీసీ మహిళనైన తనను చెప్పుకోలేని విధంగా తిడుతున్నాడని కన్నీరు పెట్టుకున్నారు. 10 వేలు ఇచ్చి రౌడీలు, గుండాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పారు. కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. కుషాయిగూడలో మోడల్ దోబీ ఘాట్ ను తనను పిలవకుండానే ప్రారంభించారని తెలిపారు.

    వరంగల్‌లో షర్మిల అరెస్టు

    [VIDEO:](url) వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగనున్న దృష్ట్యా ఆమెను చెన్నారావుపేట శంకర తండా వద్ద అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆమె కేరవాన్‌కి తెరాస కార్యకర్తలు నిప్పు పెట్టారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. దీనిపై షర్మిల స్పందించారు. తన పాదయాత్రకు వస్తున్న మద్దతును చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఇలా చేయించారని ఆరోపించారు. Few people alleged to … Read more

    రాహుల్ గాంధీకి పిగ్గీ బ్యాంకు విరాళం

    కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి ఓ పదేళ్ల బాలుడు పిగ్గీ బ్యాంకు విరాళంగా ఇచ్చాడు. ఈ డబ్బును భారత్ జోడో యాత్రకు ఉపయోగించుకోవాలని బాలుడు యశ్‌రాజ్ పర్మార్ కోరాడు. బాలుడు ఇచ్చిన విరాళం అమూల్యమైందని, అంతు లేని ప్రేమకు నిదర్శనమని రాహుల్ అన్నారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను రాహుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. त्याग और स्वार्थहीनता बचपन में मिले संस्कारों से आते हैं। ये … Read more

    ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత

    హైదరాబాద్‌లో ఎంపీ అరవింద్‌ ఇంటివద్ద తీవ్ర [ఉద్రిక్తత](url) చోటుచేసుకుంది. కవిత కాంగ్రెస్‌లో చేరతానంటూ మల్లిఖార్జున ఖర్గేకు కాల్‌ చేసిందంటూ నిన్న అరవింద్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎంపీ ఇంటిముందు టీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనకు దిగారు. ఇంట్లోకి దూసుకెళ్లి సామగ్రిని ధ్వంసం చేశారు. ఫర్నీచర్‌, కిటీకీలు, కారు అద్దాలు పగులగొట్టారు. దాడి సమయంలో అరవింద్‌ ఇంట్లో లేరు. #TRS cadre attack the #BJP MP Aravind's residence at #Hyderabad and not him. Sorry!!!#Telangana https://t.co/Avbq9BQwf3 — Sagar KV ?  … Read more

    తెదేపా నాయకుడిపై కత్తి దాడి

    కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరి రావును హత్య చేసేందుకు ప్రయత్నించాడు. భవాని మాల వేషధారణలో వచ్చిన నిందితుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా నటించి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. శేషగిరిరావు తలకు, చేతికి తీవ్ర గాయాలవ్వటంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బైక్ పై పారిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శేషగిరిరావును సీనియర్ నేతలు యనమల, రాజప్ప పరామర్శించారు.

    కెనడా ప్రధానిపై జిన్ పింగ్ అసంతృప్తి !

    జీ-20 సమావేశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య సంభాషణ ఇప్పుడు [వైరల్](url) అవుతోంది. సదస్సు వేదికగా ఇద్దరు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఆ సమాచారం మీడియాలో రావటం పట్ల జిన్ పింగ్ అసహనం వ్యక్తంచేశారు. చర్చలు జరిపే విధానం ఇది కాదంటూ వ్యాఖ్యానించారు. తమ దేశంలో ప్రతిదీ పారదర్శకంగా, నిజాయితీగా ఉండాలని భావిస్తామని..అది కొనసాగిస్తామని ట్రూడో చెప్పారు. కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం కానీ, కొన్ని సందర్భాల్లో ఏకాభిప్రాయం కుదరంటూ బదులిచ్చారు. The Cdn Pool cam … Read more

    జీ-20 సదస్సు ప్రారంభం

    ఇండోనేషియాలోని బాలిలో జీ-20 సదస్సు ప్రారంభమయ్యింది.. రెండ్రోజులపాటు నిర్వహించనున్న సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రవంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఇండోనేషియా వెళ్లారు. సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో కాసేపు మాట్లాడారు. జీ-20 నాయకులతో సవాళ్లు, వృద్ధి, ఆహారం, పర్యావరణఁ, ఆరోగ్యం, డిజిటల్ మార్పుల గురించి ఆలోచనలు విస్తరిస్తానని మోదీ చెప్పారు.

    ఉత్సాహంగా జోడో యాత్ర

    కాంగ్రెస్‌ పార్టీని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర నాందేడ్‌లోని అర్ధాపూర్‌లో రాహుల్‌ [పాదయాత్ర](url) ప్రారంభించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి నడుస్తున్నారు. యాత్రలో భాగంగా ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. భాజపా పాలనలో ఎవ్వరికి మేలు జరగలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని వివరిస్తున్నారు. #WATCH | Congress MP Rahul Gandhi, along with party leaders & workers, resumes the 'Bharat Jodo Yatra' from Ardhapur, … Read more

    ఆలోచింపజేస్తున్న పవన్ స్పెషల్ వీడియో

    సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ స్పెషల్ వీడియో ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఏముందంటే.. ‘‘వందల ఏళ్లు పాలించిన బ్రిటీషర్లను ఇప్పుడు రిషి సునాక్ ఏలుతున్నాడు. అలాంటిది ఏపీలో స్వేచ్ఛగా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోతున్నాం. నిరంకుశతత్వాన్ని ప్రశ్నించాలి’’ అంటూ ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ వీడియో నెటిజన్లను, అభిమానులను ఆలోచింపజేస్తోంది. pic.twitter.com/qGQrRnaIvf — Pawan Kalyan (@PawanKalyan) November 8, 2022