• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మునుగోడులో TRS,BJP రాళ్లదాడి

    మునుగోడులో పలివెలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రచారానికి చివరి రోజైన నేడు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. ప్రచారానికి వెళ్లిన ఈటల కాన్వాయ్‌పైనా రాళ్లతో దాడి చేశారు. పోలీసులు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. తన గన్‌మెన్లు, కార్యకర్తలు గాయపడ్డారని, 10-15 కార్లు ధ్వంసం చేశారని అయినా పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారని ఈటల ఆరోపించారు. ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనం పాటించామన్నారు.

    MLAల వ్యవహారంలో ఆడియో

    నలుగురు TRS ఎమ్మెల్యేల వ్యవహారంలో ఆడియో బయటికొచ్చింది. ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రోడ్డి నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతితో మాట్లాడుతున్న ఆడియో లీకయింది. దీనిపై ఇవాళ సీఎం కూడా మాట్లాడే అవకాశముంది.

    దివ్యాంగురాలికి జాబ్ ఇప్పించిన కేటీఆర్

    మునుగోడులో ఓ దివ్యాంగురాలికి GNM పోస్ట్ ఇప్పించిన కేటీఆర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉన్న కేటీఆర్ వద్దకు ఓ దివ్యాంగురాలు వచ్చింది. తన కుటుంబ పోషణ నిమిత్తం ఉద్యోగం కావాలని అభ్యర్థించింది. వెంటనే స్పందించిన కేటీఆర్ మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేశారు. ‘బావ ఒక చిన్న రిక్వెస్ట్.. అమ్మాయి పేరు యశోద బాగా చదువుకుంది. కానీ దివ్యాంగురాలు. ఇదివరకు కామినేనిలో GNMగా చేసిందట. చండూరు PHCలో వెకెన్సీలు ఉన్నాయి. ఓసారి వాట్సాప్‌లో పంపిస్తా చూడండి అంటూ … Read more

    పవన్‌ను కలిసిన చంద్రబాబు

    జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కలిశారు. మంగళవారం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో వీరిద్దరూ భేటీ అయ్యారు. విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై పవన్‌కు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అంతకుముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పవన్‌ను కలసి సంఘీభావం తెలిపారు. కాగా ఇటీవల విశాఖలో పవన్ మీటింగ్‌ను ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు విజయవాడ నోవా టెల్ హోటల్ కు చేరుకున్న టి డి పి అధినేత … Read more

    MUNUGODE BYPOLL: మునుగోడులో ఈ కులాల ఓటర్లే కీలకం!

    మునుగోడులో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.  ఓటర్లకు దగ్గరయ్యేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. అధికార పార్టీ టీఆర్ఎస్ సహా కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు  మునుగోడు నియోజక వర్గంలోనే తిష్ట వేశారు.  గెలుపు కోసం అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు.  ముఖ్యంగా నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాలపై దృష్టిసారించారు. వివిధ కులాలకు చెందిన ముఖ్యనేతలకు గాలం వేసే పనిలో తలమునకలై  ఉన్నారు. ఫలితంగా  ఆ సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా తమ ఓటు బ్యాంకుగా మలచుకోవాలని పావులు కదుపుతున్నారు.  మునుగోడు నియోజకవర్గంలో  ఏ … Read more

    ఫుట్‌బాల్ ఆడుతున్న చిన్నారులతో రాహుల్

    కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు 19వ రోజు కొనసాగుతుంది. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో రాహుల్‌తో పాటు ఫుట్ బాల్ ఆడుతున్న కొందరు చిన్నారులు కూడా పాల్గొన్నారు. ఈ చిన్నారులు రాహుల్‌తో పాటు నడుస్తూ.. ఫుట్ బాల్ గురించి ముచ్చటించారు. ఆ [వీడియోను](url) AICC ట్విట్టర్‌లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. #WATCH | Young football players join Congress MP Rahul Gandhi during the 'Bharat … Read more

    సూర్యపేట ఎస్పీ తీరు సిగ్గు చేటు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

    సూర్యపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ వ్యవహార శైలీపై కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజకీయ నాయకులను పొగడటం ఏంటని విమర్శించారు. ‘సూర్యపేట ఎస్పీ తీరు సిగ్గు చేటు. సీఎం కాళ్లు మొక్కిన కలెక్టర్ ఎమ్మెల్సీ అయ్యాడు. మంత్రిని ప్రశంసించిన ఎస్పీ ఎమౌతాడో’ అని ఎద్దేవా చేశారు. ఈరోజు సూర్యపేటలో జరిగిన తెలంగాణ సమైక్యత దినోత్సవంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. జగదీశ్ రెడ్డిని బాహుబలి అంటూ ఎస్పీ ప్రశంసించారు. జయహో.. జగదీశ్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు.

    మంత్రి సబితపై రాజగోపాల్‌ ఫైర్

    ఉస్మానియా వర్సిటీ విద్యార్థినులు చేపట్టిన ఆందోళనపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. హాస్టల్‌లో భోజనం, తాగునీరు సరిగ్గా ఉండటం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేసిన వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పలు ప్రశ్నలు వేశారు. అన్నం గడ్డలు గడ్డలుగా ఉంటుందని, కూరల్లో గాజుపెంకులు వస్తున్నాయని, ఈ భోజనమే మీ సీఎం మనవడు కూడా తింటాడా అని సబితను ప్రశ్నించారు. వీడియో కోసం వాచ్ఆన్ పై నొక్కండి అన్నం గడ్డలుగా, గాజు పెంకులు వచ్చిన … Read more

    జేపీ నడ్డా, నితిన్‌ భేటీ

    భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హీరో నితిన్‌ను కలిశారు. హైదరాబాద్‌ నోవాటెల్‌లో నితిన్‌తో జేపీ నడ్డా భేటీ అయ్యారు. ఈ భేటీ వెనక రాజకీయ కోణం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నితిన్ నిజామాబాద్‌ జిల్లాకు చెందినవాడు. వాళ్ల నాన్న సినీ డిస్ట్రిబ్యూటర్‌ వారికి రాజకీయంగానూ మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న తెరాసపై ఆధిపత్యం సాధించి, అక్కడి జిల్లాల్లో పట్టు బిగించేందుకే నడ్డా నితిన్‌తో భేటీ అయ్యారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవలే అమిత్‌ షా జూనియర్‌ ఎన్టీఆర్‌ను … Read more

    నితిన్‌తో నడ్డా భేటీ అందుకేనా!

    బీజేపీ అగ్రనేతలు వరుసగా సినీ తారలను కలుస్తుండటం ఆసక్తిని రేపుతోంది. ఇటీవల అమిత్‌ షా జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిశారు. కేవలం ఆర్ఆర్‌ఆర్‌లో నటనకు ప్రశంసించేందుకేనని చెప్పినా రాజకీయంగా చర్చ నడిచింది. తాజాగా మళ్లీ నితిన్‌ను జేపీ నడ్డా కలుస్తుండటం ఉత్కంఠ రేపుతోంది. నితిన్ నిజామాబాద్‌ జిల్లాకు చెందినవాడు. వాళ్ల నాన్న సినీ డిస్ట్రిబ్యూటర్‌. వారికి రాజకీయంగానూ మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న తెరాసపై ఆధిపత్యం సాధించి, అక్కడి జిల్లాల్లో పట్టు బిగించేందుకే నడ్డా నితిన్‌తో భేటీ కానున్నారని … Read more