• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Common Point in NTR, SSMB, PSPK Movies: జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో ఈ కామన్ పాయింట్ గమనించారా? 

    టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరంటే.. ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ల పేర్లు తప్పకుండా చెబుతారు. వీరు ముగ్గురూ దాదాపుగా ఒకే కాలంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 20వ దశాబ్దపు హీరోల్లో కెరీర్‌లో 25కు పైగా సినిమాలను పూర్తి చేసుకున్న ప్రముఖ నటులు కూడా వీరే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఈ హీరోలు బిజీబిజీగా గడుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర(NTR in Devara), మహేశ్ బాబు గుంటూరు కారం(Guntur Karam), పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలు చేస్తున్నాడు. అయితే, ఈ ముగ్గురి హీరోల 25వ సినిమాలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో తెలుసుకుందాం. 

    ఎన్టీఆర్ 25వ సినిమాగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలైంది. 2016లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. తండ్రి కోరికను నెరవేర్చడమే లక్ష్యంగా కొడుకు చేసిన పోరాటం ఈ సినిమా. డైరెక్టర్ సుకుమార్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. స్టైలిష్ లుక్కుతో జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టాడు. శత్రువుని తెలివిగా దెబ్బ కొట్టి తండ్రి ఆశయాన్ని నెరవేర్చే కుమారుడి పాత్రలో ఎన్టీఆర్ నటించాడు. 

    మహేశ్ బాబు 25వ సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. రైతులపై గౌరవం పెంచింది. ఈ సినిమా అనంతరం, పాఠశాలలు అగ్రికల్చర్ టూర్ చేపట్టాయంటే సినిమా ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులోనూ మిత్రుడి కోసం మహేశ్ బాబు పోరాటం చేస్తాడు. వ్యవసాయం విలువను తెలిపే ప్రయత్నం చేశాడు. 

    పవన్ కళ్యాణ్ 25వ మూవీ ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పెద్దగా అంచనాలను అందుకోలేదు. తన తండ్రిని ఎవరు చంపారు? ఎందుకు చంపారనే విషయం తెలుసుకోవడానికి కొడుకు పడే తాపత్రయం ఇది. తండ్రి స్థాపించిన సామ్రాజ్యాన్ని తిరిగి ఎలా నిలబెట్టాడనేది సినిమాలో చూపిస్తారు. 

    ఒకే పొజిషన్లలో..

    ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి రివైండ్ చేసుకోండి. వీరు ముగ్గురు ఆయా సినిమాల్లో ఓ కంపెనీకి సీఈవోగా పనిచేస్తారు. నాన్నకు ప్రేమతో సినిమాలో తారక్ KMC అనే కంపెనీని స్టార్ట్ చేస్తాడు. సినిమా ప్రారంభంలో ఈ విజువల్స్ కనిపిస్తాయి. ఇక, ‘మహర్షి’ సినిమాలో ఆరిజిన్(Origin) అనే కంపెనీకి మహేశ్ సీఈవోగా ఉంటాడు. సీఈవోగా పనిచేస్తూనే ఊర్లోకి వచ్చి ధర్నా చేస్తుంటాడు. మరోవైపు, ‘అజ్ఞాతవాసి’లోనూ పవన్ చివరికి సీఈవోగా అపాయింట్ అవుతాడు. నాన్న స్థాపించిన ‘AB’ అనే కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తాడు. పంతం సినిమాలోనూ గోపీచంద్ సీఈవోగా పనిచేస్తాడు. 

    మరో పాయింట్..

    ఈ మూడు సినిమాల్లోనూ మరో కామన్ పాయింట్ కూడా ఉంది. వీటిల్లో ఫాదర్ సెంటిమెంట్ కనిపిస్తుంది. నాన్నకు ప్రేమతో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చివరికి చనిపోతాడు. మహర్షి సినిమాలోనూ ప్రకాశ్ రాజు బతకడు. ఇక, అజ్ఞాతవాసిలోనూ బొమ్మన్ ఇరానీ మరణిస్తాడు. ఇలా ఈ మూడు సినిమాల్లో ఫాదర్ ఎమోషన్ ఉండటం యాధృచ్ఛికం అనే చెప్పొచ్చు.

    భూమికతో హిట్..

    జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌లతో భూమిక నటించింది. ఎన్టీఆర్‌ ‘సింహాద్రి’, మహేశ్ బాబు ‘ఒక్కడు’, పవన్ కళ్యాణ్ ‘ఖుషి’.. సినిమాల్లో భూమికనే హీరోయిన్. మరో విశేషం ఏంటంటే.. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తారక్, మహేశ్, పవన్ కెరీర్లో మైలురాయి సినిమాలుగా మారాయి. ఇది కూడా వీరిలో ఒక కామన్ పాయింటే. మరి, మీకు తెలిసిన సారూప్యతలను మాతో పంచుకోండి.  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv