ప్రేమ. ఈ రెండక్షరాల పదం ఒక మనిషిని మార్చగలదు. విచ్ఛిన్నం చేయగలదు. తెలుగు సినిమాలో కొన్ని రొమాంటిక్ లవ్ ప్రపోజల్స్ గురించి తెలుసుకుందాం. ఆ మరపురాని సన్నివేశాలను మరోసారి గుర్తు చేసుకుందాం.
అందాల రాక్షసి –
ఈ జనరేషన్‌లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ప్రేమ కథల్లో అందాల రాక్షసి ఒకటి. హీరో తన ప్రేమను కవితాత్మకంగా వర్ణిస్తూ ప్రపోజ్ చేయటం మనసులకు హత్తుకుంటుంది.
సఖి –
మాధవన్, శాలిని మధ్య లవ్ ప్రపోజల్ సన్నివేశం తరాలపాటు గుర్తుండిపోతుంది. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టించే శక్తి మణిరత్నం సంభాషణలకు ఉంది అనిపించే స్థాయిలో మాటలు ఉంటాయి.
ఆర్య –
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య సినిమాలో క్లైమాక్స్ గుండెల్ని పిండేస్తుంది. ఆర్యపై తనకున్న ప్రేమను తెలుసుకున్న గీత అతడి దగ్గరికి పరిగెత్తుకెళ్లటం చూస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి.
3 (Three) –
ఈ చిత్రంలో రామ్ తన ప్రేమ గురించి జననికి చెప్పినప్పుడు ప్రేమలో స్వచ్ఛత, యుక్త వయసులో కలిగే ఫీలింగ్స్‌ను తెలుపుతాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఈ సన్నివేశం ఎప్పుడూ ప్రత్యేకమే.
ఏ మాయ చేసావే –
మీ భాగస్వామి పట్ల ఉన్న ప్రేమ కారణంగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామాకు సలాం కొట్టాల్సిందే. కార్తిక్ ప్రేమను జెస్సీ అంగీకరిస్తూ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ, ఇందులో చైతూ, సామ్ నటన ఆ ప్రేమ సన్నివేశాన్ని మరింత అందంగా మార్చాయి.
మిర్చి –
ఈ సినిమాలో ప్రేక్షకుల మనసును గెలిచే ఈ సన్నివేశం కొద్దిసేపు మాత్రమే ఉన్నప్పటికీ, సీన్ ప్రభావం మాత్రం బాగా ఉంటుంది. ఒక్క ఛాన్స్ ఇస్తావా అంటూ ప్రభాస్ అనుష్కకి ప్రపోజ్ చేసే సన్నివేశానికి విజిల్స్ పడ్డాయి.
కలర్ ఫొటో-
తెలుగు చిత్ర పరిశ్రమలో ఊహించని ప్రయత్నం ఈ సినిమా. అమాయకత్వం, నిజాయితీ అనే భావాలను కలర్ ఫొటోలో చూపించారు. నిజాయితీగా తన ప్రేమను హీరోయిన్‌కు చెప్పి ఆమెను ఒప్పించే సీన్ ఓ అద్భుతం.
సూర్య S/O కృష్ణన్ –
దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సినిమా ద్వారా తనలో మరో కళను బయటపెట్టాడు. చిత్రంలో తండ్రి, కుమారుడు మధ్య సమాంతరంగా జరిగే ప్రేమ సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. కానీ, ‘నాలోనే పొంగెను నర్మద’ అనే పాట పాడుతూ హీరోయిన్‌కు తన ప్రేమను తెలిపే సన్నివేశం మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.
మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు –
ప్రేమించిన వ్యక్తి పట్ల ఉండే ఫీలింగ్స్ గురించి సినిమా సాగుతుంది. ప్రత్యేకంగా శర్వానంద్, నిత్యమీనన్ కొన్ని సంవత్సరాల తర్వాత కలిసినప్పటికీ వారిద్దరి మధ్య అదే గౌరవం, ప్రేమ ఉండటం, ఇద్దరూ కవిత్వం ద్వారా ప్రేమను వ్యక్తపరచడం సినిమాలో అదిరిపోయే సీక్వెన్స్.
మజ్ను
నాని హీరోగా నటించిన మజ్ను.. మీ జీవితంలో రొమాంటిక్ రిలేషన్‌షిప్స్‌ను గుర్తు చేసే సినిమా. ఇందులోని లవ్ లెటర్ సీన్ ఒక మనిషి నిజంగా ప్రేమలో పడితే ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో తెలియజేస్తుంది.