యంగ్ బ్యూటీ దివి వద్త్యా (Divi Vadthya).. ‘లంబసింగి’ (Lambasingi) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగు ఆడియన్స్ దృష్టి దివిపై పడింది. ఈ భామ గురించి తెలుసుకునేందుకు వారు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.
దివి.. మార్చి 15, 1996లో హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు.. శశికాంత్ వద్త్యా, దేవకి. పదో తరగతి వరకూ జూబ్లీ హిల్స్‌లోని పబ్లిక్ స్కూల్లో ఆమె చదువుకుంది. జి. నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎంబీఏ పూర్తి చేసింది.
కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించిన దివి.. పలు ఫ్యాషన్ సంస్థలకు మోడలింగ్ చేసింది. 2018లో తొలిసారిగా ‘లెట్స్ గో’ అనే షార్ట్ ఫిల్మ్‌లో దివి నటించింది.
మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కిన మహర్షి (2019) సినిమాతో దివి వెండితెరపై అడుగుపెట్టింది. ఇందులో కాలేజీ స్టూడెంట్ పాత్రలో కొన్ని సీన్లలో కనిపించింది.
ఆ తర్వాత సందీప్ కిషన్ (Sandeep Kishan) హీరోగా చేసిన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమాలో దివి మరోమారు తళుక్కుమంది. ఇందులో దివ్య పాత్రలో కనిపించి పర్వాలేదనిపించింది.
ఆ తర్వాత ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4’లో అడుగుపెట్టిన దివికి ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. 49 రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ.. తన అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేసింది.
బిగ్ బాస్ తర్వాత దివికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ‘క్యాబ్ స్టోరీస్’ అనే చిత్రంలో ఫీమేల్ లీడ్ పాత్రలో ఈ భామ సర్ప్రైజ్ చేసింది. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’లో కనిపించి దివి మరింత పాపులర్ అయ్యింది. తన సినిమాలో దివికి అవకాశమిస్తానని బిగ్‌బాస్ స్టేజీపైన చిరు చెప్పడమే కాకుండా ‘గాడ్ ఫాదర్’ ద్వారా ఆ మాటను నిలబెట్టుకోవడం విశేషం.
అదే ఏడాది మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా చేసిన ‘జిన్నా’ (Jinna) సినిమాలోనూ దివి ఓ కీలక పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచి ఈ బ్యూటీని నిరాశ పరిచింది.
అనంతరం ‘రుద్రంగి’ సినిమాలో ‘జాజి మెుగులాలి’ పాటలో దివి చిందేసింది. తన అద్భుతమైన నృత్యంతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది.
తాజాగా ఆమె నటించిన ‘లంబసింగి’ విజయం సాధించడంతో ఈ భామ చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్ర విజయంతో వరుస అవకాశాలు వస్తాయని ఈ దివి ఆశిస్తోంది.
ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడిన దివి.. గతంలో రవితేజ (Ravi Teja) సినిమాలో తనకు అవకాశం వచ్చిందని చెప్పింది. అయితే చివరి నిమిషంలో ఆ ఛాన్స్ మిస్ అయ్యిందని పేర్కొంది. అలా ఎందుకు జరిగిందో తెలీదని చెప్పుకొచ్చింది.
కెరీర్ ప్రారంభంలో సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడినట్లు దివి తెలిపింది. బాత్రూమ్లో షవర్ కింద ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని వాపోయింది.
అయితే గతంలో ఓ వ్యక్తిని ప్రేమించినట్లు దివి ఓ ఇంటర్యూలో తెలిపింది. అతని కుటుంబంలో చిన్న సమస్య రావడంతో బ్రేకప్ చెప్పుకున్నట్లు వివరించింది.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!