అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్మీ (Allu Army), మెగా ఫ్యాన్స్ (Mega Fans) ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ‘పుష్ప 2’ చిత్రాన్ని బాయ్‌కాట్ చేస్తామంటూ కూడా మెగా ఫ్యాన్స్ వార్నింగ్‌లు సైతం ఇస్తున్నారు. అయితే అల్లు వర్సెస్ మెగా వివాాదాని (Allu Vs Mega Families)కి కేంద్రంగా మారిన ప్రాంతం ఏపీలోని నంద్యాల. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో నంద్యాల వైకాపా అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా బన్నీ ఆ ఏరియాలో ప్రచారం చేయడాన్ని మెగా ఫ్యాన్స్, జన సైనికులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి బన్నీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇదిలాఉంటే తాజాగా నంద్యాలలోని బన్నీ ఫ్యాన్స్ అత్యవసర మీటింగ్‌కు పిలుపునిచ్చారు. దీంతో నంద్యాల కేంద్రంగా మరో రచ్చ మెుదలవుతుందా అన్న అనుమానాలు మెుదలయ్యాయి.
మీటింగ్ అందుకేనా!
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ (Allu Vs Mega Families) ఒక చోట సమావేశం కాబోతున్నారు. ఆత్మకూరు రోడ్డులోని చెరువుకట్ట ప్రాంతంలో గురువారం ఉదయం 10:30కు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను నంద్యాల ట్విటర్ హ్యాండిల్స్ ద్వారా ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే మెగా – అల్లు ఫ్యామిలీ రచ్చకు కారణమైన నంద్యాలలో ఫ్యాన్స్ ఈ మీటింగ్ పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశం ద్వారా మరో వివాదానికి వారు తెరలేపుతారా? అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’ సినిమా నేపథ్యంలోనే ఈ భేటి జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ కోసం తమ అభిమాన హీరోకు ఏ విధంగా సాయపడాలి? ఎలా అండగా నిలవాలి? మెగా ఫ్యాన్స్ చేస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని ఎలా అడ్డుకోవాలి? అన్న దానిపై ఈ మీటింగ్‌లో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
నంద్యాల ఘటన గుర్తుందా?
ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలపడానికి ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నంద్యాలకు వెళ్లారు. దీంతో అప్పట్లోనే బన్నీ వ్యవహార శైలి ఏపీ రాజకీయాలతో పాటు, తెలుగు చిత్ర పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారింది. శిల్పా రవి భార్య నాగిని రెడ్డి.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి క్లాస్ మెట్స్. అలా శిల్పా రవితో బన్నీకి పరిచయం ఏర్పడి స్నేహాంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో శిల్పా రవికి బన్నీ ట్విటర్ ద్వారా ‘ఆల్ ది బెస్ట్’ తెలిపి ఊరుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం కూడా సాధించారు. ఈసారి కూడా వైకాపా తరపున శిల్పా రవి బరిలో ఉండటంతో బన్నీ నేరుగా రంగంలోకి దిగాడు. మామయ్య పవన్ కల్యాణ్ గెలుపును కాంక్షిస్తూ ట్విటర్లో ఒక పోస్టు మాత్రమే పెట్టిన బన్నీ పవన్ ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి కోసం స్వయంగా రావడం పొలిటికల్ వర్గాల్లో (Allu Vs Mega Families) హాట్ టాపిక్‌గా మారింది. కాగా, నంద్యాలలో బన్నీ మద్దతిచ్చిన వ్యక్తి ఓడిపోగా కూటమి అభర్థి, టీడీపీ నేత ఫరూఖ్ ఘన విజయం సాధించారు.
‘కిస్సిక్’ నేపథ్యంలోనూ బన్నీపై ట్రోల్స్!
నంద్యాల ఘటన నుంచి బన్నీని టార్గెట్ చేసిన మెగా ఫ్యాన్స్ (Allu Vs Mega Families) అతనిపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. బన్నీ తాజా చిత్రం ‘పుష్ప 2’ రిలీజ్‌కు రెడీ అయిన నేపథ్యంలో ఈ ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ఐటెం సాంగ్ ‘కిస్సిక్’ను ఆధారంగా చేసుకొని ఓ ఎడిటింగ్ వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రమోషన్స్ సందర్భంగా స్టార్ హీరోయిన్స్ రష్మిక మందన్న, శ్రీలీలను బన్నీ ఆలింగనం చేసుకోగా కిస్సిక్ లిరిక్స్‌ను వాటికి మ్యాచ్ అయ్యేలా ఎడిట్ చేశారు. ‘దెబ్బలు పడతాయిరో మామా’ గత చిత్రాల్లో బన్నీపై చేయిచేసుకున్న వీడియోలను దానికి జత చేశారు. ప్రస్తుతం ఈ ఎడిటింగ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
బన్నీ ఇన్‌స్టా పోస్టుపై వివాదం
సోషల్ మీడియాలో బన్నీ, పవన్ ఫ్యాన్స్ మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతోంది. ఇటీవల చెన్నైలో జరిగిన ‘పుష్ప 2’ ప్రమోషనల్ ఈవెంట్‌లోని పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు కనిపించాయి. ఏం పీకలేరు బ్రదర్ అంటూ ‘పీకే’ (పవన్ కల్యాణ్) హైలెట్ చేస్తూ ఇంగ్లీష్ టెక్ట్స్‌లో ఉన్న ఓ ఫ్లకార్డ్ చర్చనీయాంశంగా మారింది. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రీలీలతో దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అందులో పోస్టర్ కనిపించింది. అయితే ఇది యాదృచ్చికంగా జరిగిందా? కావాలనే బన్నీ పెట్టాడా? అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. అయితే ఈ పోస్టును చూసి పవన్ ఫ్యాన్స్ మరోమారు బన్నీపై రెచ్చిపోయారు. అటు అల్లు ఆర్మీ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం మెుదలుపెట్టింది. ఇది గమనించిన బన్నీ ఆ ఫ్లకార్డ్‌ను తీసేసి క్రాప్ ఇమేజ్ను మరోమారు ఇన్‌స్టాలో షేర్ చేశారు. అయితే జరగాల్సిన ఫ్యాన్ డ్యామేజ్ అంతా అప్పటికే జరిగిపోయిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ