అక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం జరిగింది. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున (Akkineni Nagarjuna) స్వయంగా ప్రకటించారు. చిన్న కోడలు – కుమారుడు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. డిసెంబర్లో పెద్ద కూమారుడు అక్కినేని నాగచైతన్య వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఖిల్ కూడా త్వరలో పీటలు ఎక్కబోతుండటంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
పెళ్లికూతురు ఎవరంటే?
అఖిల్ అక్కినేని నిశ్చితార్థం (Akkineni Akhil Engagement) ఇవాళ (నవంబర్ 26) హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో ఘనంగా జరిగింది. ప్రముఖ ఆర్టిస్టు ‘జైనాబ్ రవద్జీ’ చేతికి అఖిల్ ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాడు. ఈ వేడుకకు అతికొద్ది మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలకు చెందిన అతి ముఖ్యులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అక్కినేని నాగార్జున పంచుకున్నారు. అక్కినేని కుటుంబంలోకి చిన్న కోడలికి స్వాగతం పలికారు. ఈ యువ జంటను ఆశీర్వదించండంటూ నాగార్జున కోరారు.
వచ్చే ఏడాదే పెళ్లి!
అఖిల్ చాలాకాలం నుంచి నటి జైనాబ్ రవద్జీ (Akkineni Akhil Engagement) ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపగా వారు కూడా అంగీకరించారు. దీంతో అందరి సమక్షంలో ఒక్కటయ్యేందుకు వీరు రెడీ అయ్యారు. నిశ్చితార్థం జరుపుకొని పెళ్లి వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అఖిల్ పెళ్లి వచ్చే ఏడాదిలో జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక డిసెంబర్ 4న జరగనున్న అక్కినేని నాగచైతన్య – శోభిత దూళిపాళ్ల పెళ్లిలో అఖిల్ జంట ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
గతంలో అఖిల్ నిశ్చితార్థం రద్దు
అక్కినేని నాగచైతన్య సమంతల వివాహం కంటే ముందే అక్కినేని అఖిల్ (Akhil Akkineni) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. రామ్ చరణ్ భార్య ఉపాసన బంధువు అయినా శ్రియ భూపాల్‌తో అఖిల్‌కు నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళలేదు. కొన్ని కారణాలతో అఖిల్-శ్రియ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ క్రమంలో శ్రియ భూపాల్ మరో యువకుడిని పెళ్లి చేసుకోగా అఖిల్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు జైనాబ్ రవద్జీతో పెళ్లికి సిద్ధమయ్యాడు.
అఖిల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా అఖిల్ నెక్ట్స్ ఫిల్మ్ రాబోతున్నట్లు సమాచారం. అక్కినేని నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తారని అంటున్నారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ (Murali Kishore) ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన సైతం వస్తుందని చెబుతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు సైతం ఇప్పటికే మెుదలైనట్లు చెబుతున్నారు. దీంతో పాటు ‘సాహో’కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన అనిల్ కుమార్‌తో మరో ప్రాజెక్ట్ అఖిల్ చేయనున్నట్లు సమాచారం. ఈ కొత్త డైరెక్టర్ చెప్పిన స్టోరీ అఖిల్‌కు విపరీతంగా నచ్చిందని, వెంటనే స్క్రిప్ట్ కూడా ఓకే చేశారని టాక్. ఈ నేపథ్యంలో అఖిల్ ఈ రెండు చిత్రాలను ఒకేసారి ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ