‘దసరా’ (Dasara)తో నటుడు నాని తొలిసారి రూ.100 కోట్ల క్లబ్లో చేరాడు. ఆ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తనకుంటూ ప్రత్యేక గురింపు సంపాదించాడు. సుకుమార్ అసిస్టెంట్‌గా ‘రంగస్థలం’ (Rangasthalam)కు వర్క్ చేసిన శ్రీకాంత్ తొలి చిత్రంతోనే స్టార్ డైరెక్టర్ స్టేటస్ సంపాదించాడు. ఇప్పుడు తన రెండో చిత్రం కూడా నానితోనే చేయబోతున్నాడు. ఈ మూవీకి ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. ఓ దిగ్గజ నటుడు ఈ మూవీలో భాగం కాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీంతో నాని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
విలన్‌గా మోహన్‌బాబు!
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రానున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) చిత్రం సికింద్రాబాద్ నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడైతే ఆ పాత్రకు బాగా న్యాయం చేస్తాడని దర్శకుడు శ్రీకాంత్ భావించినట్లు సమాచారం. పలు పేర్లను పరిశీలించిన పిదప డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) పేరును ఫైనల్ చేసినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మోహన్‌బాబును సంప్రదించి విలన్ రోల్ గురించి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వివరించినట్లు కూడా తెలుస్తోంది. ఆ పాత్ర మోహన్ బాబుకు బాగా నచ్చినట్లు సమాచారం. దీంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ సైతం ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీంతో నేచురల్ స్టార్ నాని – డైలాగ్ కింగ్ మోహన్ బాబు వైరం స్క్రీన్‌పై ఏ స్థాయిలో పడుతుందో చూడాలని సినీ లవర్స్ ఇప్పటినుంచే ఎదురుచూస్తున్నారు.
డైలాగ్ కింగ్‌ను ఢీ కొట్టగలడా?
డైలాగ్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)కి విలక్షణ నటుడిగా పేరుంది. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా టాలీవుడ్‌పై ఆయన చెరగని ముద్ర వేశారు. కెరీర్ తొలినాళ్లలో ఎక్కువ విలన్ పాత్రల్లోనే మోహన్ బాబు కనిపించారు. అత్యంత కఠినమైన డైలాగ్‌ను సైతం గుక్కతిప్పుకోకుండా చెప్పగల సామర్థ్యం మోహన్‌బాబుకు ఉంది. అటువంటి మోహన్ బాబును నేచురల్ స్టార్ నాని ఢీకొట్టడమంటే సాధారణ విషయం కాదు. గతంలో ప్రభాస్ చేసిన ‘బుజ్జిగాడు’ సినిమాలోనూ మోహన్ బాబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. మోహన్ బాబు ముందు ప్రభాస్ కొన్ని సీన్స్‌లో తేలిపోయాడన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు నాని-మోహన్ బాబు కాంబో (The Paradise)ను కూడా అదే విధంగా ప్రేక్షకులు చూసే ఛాన్స్ ఉంది. కెరీర్లోనే తొలిసారి దిగ్గజ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోనుండటంతో నానికి ‘ది ప్యారడైజ్’ చిత్రం అగ్నిపరీక్ష కానుందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నారు.
టైటిల్ లీక్‌పై అసహనం
నటుడు నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందనున్న’ది ప్యారడైజ్’ (The Paradise) మూవీ టైటిల్ మేకర్స్ అనౌన్స్ చేయకముందే లీకయ్యింది. దీంతో వర్కింగ్ టైటిల్‌తో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావించిన శ్రీకాంత్ ఓదెల చివరికీ టైటిల్‌ను అనౌన్స్ చేయక తప్పలేదు. ఈ లీక్ వ్యవహారంపై కొన్ని రోజుల కింద దర్శకుడు శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకు పాల్పడిన వ్యక్తులు ఎవరో తనకు తెలుసని అన్నారు. శ్రీకాంత్ టీమ్‌లోని వారే లీక్ చేశారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఏ సినిమాకైనా లీకల బెడద ఉంటే వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్స్, రచయితలను తప్పుబట్టడం సరికాదని అన్నారు. కష్టపడి పనిచేసే డిపార్ట్మెంట్లపై నిందలు వేసే అలవాటును మార్చుకోవాలని సూచించారు. తన సినిమా టైటిల్‌ను లీక్ చేసిన వారు ఎవరో తెలుసని, తన టీమ్‌లోవారు మాత్రం కాదని స్పష్టం చేశారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ