అక్కినేని అఖిల్ (Akkineni Akhil) త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. మంగళవారం (నవంబర్ 26) జైనాబ్ రవద్జీ (Zainab Ravdjee)తో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు అక్కినేని అభిమానులతో పాటు సినీ లవర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో జైనాబ్, ఆమె కుటుంబానికి సంబంధించి సమాచారంపై ఓ లుక్కేద్దాం.
జైనాబ్ (Zainab Ravdjee) హైదరాాబాద్కు చెందిన యువతి. థియేటర్ ఆర్టిస్టుతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా ఆమెకు మంచి పేరుంది.
వాస్తవానికి ముంబయికి నేపథ్యమున్న కుటుంబంలో జైనాబ్ (Akkineni Akhil) జన్మించింది. హైదరాబాద్‌లోనే పుట్టి పెరగడంతో ఇక్కడి కల్చర్‌కు బాగా అలవాటు పడింది.
భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఆమె థియేటర్ ఆర్టిస్టుగా వర్క్ చేశారు. దుబాయి, లండన్‌లో ప్రత్యేక ప్రదర్శనలు చేసి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
జైనాబ్‌లో ఓ మంచి పెయింటింగ్ కళాకారిణి కూడా. 27 ఏళ్ల వయసులోనే హైదరాబాద్‌లో ‘రిఫ్లెక్షన్’ పేరుతో మెగా ఎగ్జిబిషన్ నిర్వహించి జైనాబ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
రెండేళ్ల క్రితం జైనాబ్‌తో అఖిల్‌కు పరిచయం అయినట్లు తెలుస్తోంది. తొలుత మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారట. మనసులు కలవడంతో ప్రేమికులుగా మారేందుకు ఎక్కువ సమయం పట్టలేదని సమాచారం.
జైనాబ్ తండ్రి జుల్ఫీ రవద్జీ (Julbi Ravdjee) ప్రముఖ వ్యాపారవేత్త. ‘జెడ్.ఆర్. రెన్యువబుల్ ఎనర్జీ’ (ZR Renewable Energy Pvt Ltd) కంపెనీ ఉంది. దీనితో పాటు పలు కంపెనీల్లో వాటాలు ఉన్నట్లు సమాచారం.
జుల్బీ రవద్జీ ఏపీలోని గత వైకాపా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. జగన్‌కు సలహాదారుడిగా ఆయన వర్క్ చేశారు.
మిడిల్ ఈస్ట్ దేశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా జుల్ఫీ పని చేశారు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడంలో తనవంతు కృషి చేశారు.
జైనాబ్ రవద్జీకి ఒక సోదరుడు ఉన్నాడు. అతడి పేరు జైన్ రవద్జీ. ప్రస్తుతం ‘జెడ్.ఆర్. రెన్యువబుల్ ఎనర్జీ’ (ZR Renewable Energy Pvt Ltd) కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.
జైనాబ్ తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రైవేటులో ఉంచింది. దీంతో ఆమె వ్యక్తిగత ఫొటోలు, ఇష్టాఇష్టాలు, ఇతర సమాచారం ఎవరికీ తెలియడం లేదు.
జుల్బీ రవద్జీతో అక్కినేని కుటుంబానికి మంచి రిలేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. వారి మధ్య స్నేహబంధం ఉన్నట్లు టాక్ ఉంది.
జైనాబ్‌కు స్కిన్ కేర్‌కు సంబంధించిన ఓ సంస్థ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘వన్స్ ఆపన్ ది స్కిన్’ పేరుతో ఓ పేజీ నడుపుతోంది.
ఆ స్కిన్ కేర్ పేజీ ద్వారా చర్మ రక్షణకు సంబంధించిన టిప్స్‌ను యూత్‌కు అందిస్తోంది. చర్మం కాంతివంతంగా మెరిసేందుకు సలహాలు, సూచనలు ఇస్తోంది.
అఖిల్ – జైనాబ్ పెళ్లిపై ఓ వార్త హల్చల్ చేస్తోంది. నాగచైతన్య – శోభితా దూళిపాళ్లతో పాటే వీరి పెళ్లి కూడా జరపాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ