అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా మరో వారం రోజుల్లోనే రిలీజ్ కానుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను భారీగా చేస్తోంది. ఇప్పటికే పాట్నా, చెన్నైలో భారీ ఈవెంట్స్ నిర్వహించగా నేడు (నవంబర్ 27) కేరళలో మరో ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఇందులో పాల్గొనేందుకు చిత్రం బృందం హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో కొచ్చి వెళ్లింది. అక్కడ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన బన్నీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్స్ సాగర స్వాగతం పలికారు.
దద్దరిల్లిన విమానశ్రయం..
కొచ్చి ఎయిర్‌పోర్టులో దిగిన బన్నీకి కేరళ అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అల్లు అర్జున్ రాక గురించి ముందే తెలుసుకొని వారంతా పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు తరలి వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న బన్నీకి సుస్వాగతం పలికారు. తమ అభిమాన హీరోను తమ ఫోన్ కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. అంతేకాదు బన్నీతో ఫొటోలు దిగేందుకు కూడా ఎగబడ్డారు. అంచనాలకు మించి వచ్చిన ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయడానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులు బాగా కష్టపడాల్సి వచ్చింది. అభిమానుల కేరింతలకు దెబ్బకు ఓ దశలో బన్నీ తన రెండు చెవులు మూసుకోవడం గమనార్హం. రాష్ట్రం కాని రాష్ట్రంలో బన్నీ వస్తోన్న ఈస్థాయి ఆదరణ చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘రాజు ఎక్కడ ఉన్న రాజే’ అని కామెంట్స్ చేస్తున్నారు.
కేరళలో ఎందుకంత క్రేజ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఏపీ, తెలంగాణ తర్వాత ఆ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాష్ట్రం కేరళ. అక్కడి ప్రజలు బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ (Mallu Arjun) అని పిలుచుకుంటారు. కెరీర్ తొలినాళ్లలో చేసిన ‘ఆర్య’ కేరళలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 100 రోజులకు పైగా ఆడింది. ‘ఆర్య’ నుంచి అల్లు అర్జున్ను కేరళ ప్రజలు ఓన్ చేసుకోవడం మెుదలపెట్టారు. అల్లు అర్జున్ హీరోగా చేసిన ప్రతీ సినిమా కేరళలో కచ్చితంగా రిలీజ్ అవుతూ వచ్చింది. తెలుగులో ఏ విధమైన రెస్పాన్స్ వచ్చేదో కేరళలోనూ అంతే స్థాయిలో ప్రేక్షకులు బన్నీ చిత్రాన్ని ఆదరించారు. బన్నీ గత చిత్రం ‘పుష్ప’ సైతం కేరళలో బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ (Pushpa 2) కేరళ ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొచ్చిలో ప్రమోషన్ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు.
రన్ టైమ్ లాక్
‘పుష్ప 2’ చిత్రానికి సంబంధించి రన్టైన్ లాక్ అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా సుకుమార్ సినిమా అంటే మూడు గంటలు కచ్చితంగా ఉంటుందని అభిమానులు ఓ అంచనాకు వచ్చేస్తుంటారు. ఆయన గత చిత్రాలు ‘రంగస్థలం’, ‘పుష్ప’ దాదాపు మూడు గంటల నిడివితో వచ్చి బ్లాక్ బాస్టర్లుగా నిలిచాయి. అయితే ఇప్పుడు ‘పుష్ప 2’ మూడు గంటలకు పైగా నిడివితో రాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమాకు 3 గంటల 22 నిమిషాల నిడివిని డైరెక్టర్ సుకుమార్ ఫిక్స్ చేశారట. యూఎస్‌లో 3 గంటల 15 నిమిషాల నిడివితో ‘పుష్ప 2’ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు పర్యవేక్షణ అనంతరం అఫిషియల్‌గా నిడివిని అనౌన్స్ చేయనున్నారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ