• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Samantha: నన్ను ‘సెకండ్‌ హ్యాండ్‌, యూజ్డ్‌’ అంటున్నారు!

    ఒకప్పుడు టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్ అనగానే ముందుగా నాగ చైతన్య – సమంత జోడీనే గుర్తుకు వచ్చేది. రీల్‌ స్క్రీన్‌తోపాటు నిజ జీవితంలోనూ అప్పట్లో ఈ జంట చూడముచ్చటగా కనిపించేది. గతంలో సమంత హోస్ట్‌గా వ్యవహరించిన ఆహా షోకు వచ్చిన చైతూ తమ రిలేషన్‌ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. దీంతో ఉంటే సమంత-చైతూలా ఉండాలని అప్పట్లో చాలా జంటలే భావించాయి. అయితే అనూహ్యంగా విడాకులు తీసుకొని ఈ జంట అందర్నీ షాక్‌కు గురిచేసింది. చైతూ డిసెంబర్‌లో రెండో పెళ్లి సైతం చేసుకోబోతున్నాడు. ఇదిలాఉంటే తాజాగా విడాకులపై  సమంత (Samantha) చేసిన కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. 

    ‘సెకండ్‌ హ్యాండ్‌, యూజ్డ్‌’..

    నటుడు నాగచైతన్య (Naga Chaitanya)తో విడాకుల అంశంపై స్టార్ హీరోయిన్‌ సమంత (Samantha)  తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. డివోర్స్‌ తీసుకున్న తర్వాత అమ్మాయిలకు సమాజం కొన్ని ట్యాగ్స్‌ ఇస్తున్నట్లు చెప్పింది. సెకండ్‌ హ్యాండ్‌, ఆమె లైఫ్‌ వృథా, యూజ్డ్‌’ అంటూ కొన్ని ట్యాగ్స్‌ తలిగిస్తున్నట్లు పేర్కొంది. అలా ఎందుకు తగిలిస్తారో అర్థం కావడం లేదని తెలిపింది. ఆ అమ్మాయిని, ఆమె కుటుంబాన్నిఈ విమర్శలు ఎంతో బాధిస్తాయని ఆవేదన వ్యక్తం చేసింది. తన గురించి కూడా ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారని, వాటి గురించి మాట్లాడాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది. కష్టసమయంలో తనకు అండగా నిలిచిన స్నేహితులు, కుటుంబ సభ్యులకు సామ్ థ్యాంక్స్ చెప్పింది.

    పెళ్లి గౌను రీమోడల్‌ పైనా..

    సమంత (Samantha) తన పెళ్లి గౌనును ఇటీవల రీ మోడల్ చేయించిన సంగతి తెలిసిందే. ఈ వెడ్డింగ్‌ గౌను అప్పట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనిని సామ్‌ రీడిజైన్‌ చేయించినట్లు తెలవడంతో అక్కినేని ఫ్యాన్స్ సమంతపై విమర్శలు చేశారు. చైతూ రెండో పెళ్లి నేపథ్యంలో ప్రతీకారం కోసమే ఆమె ఇలా చేసిందని నెట్టింట ఆరోపించారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ వెడ్డింగ్‌ గౌను వ్యవహారంపైనా సామ్‌ స్పందించింది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా బాధపడినట్లు తెలిపింది. ఆ గౌను రీడిజైన్‌ ద్వారా తాను ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించలేదని స్పష్టం చేసింది. తన జీవితంలో జరిగిన విషయాలను ఎప్పుడూ దాచాలని అనుకోలేదని తెలిపింది. ఎన్నో కష్టాలు దాటుకొని ఈ దశకు వచ్చినట్లు సమంత తెలిపింది. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. 

    ‘ఇంకా సాగదీయడం తప్పు’

    నటుడు నాగచైతన్య సైతం తాజాగా విడాకుల అంశంపై స్పందించినట్లు తెలుస్తోంది. సమంత (Samantha)తో విడాకులు అనుకోకుండా జరిగిందని చైతూ అన్నట్లు సమాచారం. ‘ఆ ఫేజ్‌పై తనకు చాలా గౌరముంది. వార్తల్లో హెడ్‌లైన్స్‌ కోసం ఇంకా సాగదీయడం తప్పు. ఇండస్ట్రీకి వచ్చింది ప్రొఫెషనల్‌ లైఫ్‌తో ఎంటర్‌టైన్‌ చేయడానికి, పర్సనల్‌ లైఫ్‌తో కాదు’ అని చైతూ అన్నట్లు తెలుస్తోంది. అయితే సమంత వ్యాఖ్యల నేపథ్యంలోనే చైతూ ఈ కామెంట్‌ చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రెండో పెళ్లికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్న ఈ తరుణంలో సామ్‌తో విడాకుల అంశం చర్చకు రావడం నచ్చకే ఈ కామెంట్స్ చేసి ఉంటాడని అంటున్నారు. పలు సోషల్‌ మీడియా, యూట్యూబ్ హ్యాండిల్స్‌కు సైతం చైతూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

    నెట్‌ఫ్లిక్స్‌లో చైతూ పెళ్లి లైవ్‌!

    ప్రముఖ నటి శోభితా దూళిపాళ్లను నాగచైతన్య రెండో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 4న బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది. అయితే పెళ్లిని ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలని అక్కినేని ఫ్యామిలీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు స్ట్రీమింగ్ హక్కులు అందించినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. నయనతార-విఘ్నేశ్‌ జంట కూడా గతంలో తమ పెళ్లిని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు ఇచ్చారు. అయితే ఇందుకోసం నెట్‌ఫ్లిక్స్‌ రూ.25 కోట్లు చెల్లించిందట. అయితే శోభిత-చైతు పెళ్లి కోసం ఏకంగా రూ.50 కోట్లు ఇస్తున్నట్లు ఓటీటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చైతూ రెండో పెళ్లిపై గత కొంతకాలంగే పెద్ద ఎత్తున బజ్ నడుస్తుండటంతో నెట్‌ఫ్లిక్స్‌ ఆ స్థాయిలో చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv