తెలుగు సినీ ప్రపంచంలో స్టైలిష్ స్టార్‌గా కీర్తించబడి ఐకాన్ స్టార్‌గా అభిమానుల మనసు దోచుకున్న యంగ్ హీరో అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఇతను వృతిపరమైన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. సినీ నేపథ్య కుటుంబమైనప్పటికీ తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పరచుకోని ఓవరాల్ ఇండియాలోనే మేటి నటుడిగా గుర్తింపు సాధించాడు. మరి అలాంటి అల్లు అర్జున్ వ్యక్తిగత, వృతిపరమైన జీవిత విశేషాలు ఏంటో మీరూ తెలుసుకోండి.
అల్లు అర్జున్ ఎవరు..?
టాలీవుడ్‌లో స్టార్ హీరో, పుష్ప చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు
అల్లు అర్జున్ పుట్టిన రోజు ఎప్పుడు?
ఇతను 1982, ఏప్రిల్ 8న చెన్నైలో అల్లు అరవింద్- నిర్మల దంపతులకు జన్మించారు. వీరి తాతయ్య అల్లు రామలింగయ్య ఎన్నో సినిమాలో హాస్య నటుడిగా, మరెన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అప్పటి నుంచే వీరి కుటుంబానికి సినీ పరిశ్రమతో చక్కని అనుబంధం ఏర్పడింది.
అల్లు అర్జున్ వయస్సు?
బన్నీ వయస్సు 42 సంవత్సరాలు.
అల్లు అర్జున్ ఎత్తు ఎంత?
5 అడుగుల 9 అంగుళాలు
అల్లు అర్జున్ ఎన్ని సినిమాల్లో హీరోగా నటించాడు..?
అల్లు అర్జున్ ఇప్పటి వరకు 20 సినిమాల్లో హీరోగా నటించాడు. త్వరలో పుష్ప-2 సినిమా రిలీజ్ కానుంది. తదనాంతరం ఐకాన్, AA 23 మూవీల్లో నటించనున్నట్లు సమాచారం.
బాల్య నటుడిగా ప్రస్థానం ఎప్పుడు..?
మూడేళ్ల వయసులోనే వెండితెరకు పరిచయం అయ్యాడు. 1985లో రిలీజ్ అయిన విజేత సినిమాలో శారద కొడుకుగా నటించాడు. స్వాతిముత్యం సినిమాలో శివయ్య మనువడిగా యాక్ట్ చేసి ఆకట్టుకున్నాడు.
అల్లు అర్జున్ భార్య ఎవరు..? పెళ్లి ఎప్పుడు జరిగింది..?
2011, మార్చి 6న స్నేహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. యూఎస్‌లో ఓ ఫ్రెండ్ మ్యారేజ్‌కి వెళ్లిన తరుణంలో స్నేహారెడ్డిని చూసి ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ కాస్త పరిణయానికి దారి తీసింది. వీరికి కుమారుడు అయ్యాన్, కుమార్తె అర్హ జన్మించారు. అల్లు అర్జున్ ఫ్రొపెషనల్ లైఫ్ చూసుకుంటే, స్నేహారెడ్డి ఫ్యామిలీని బాధ్యతలు చూసుకుంటుంది.
అల్లు అర్జున్ ముద్దు పేర్లు ఏంటి..?
ఇతడిని టాలీవుడ్ ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ ముద్దుగా బన్నీ అని పిలుస్తుంటారు. క్లాస్‌మెట్ అయిన రానా చెర్రీ అనేవాడట. అలాగే కేరళ ఫ్యాన్స్ ఇతడిని మల్లు అర్జున్ అంటుంటారు.
అల్లు అర్జున్‌కి ఇష్టమైన మూవీ ఏది..?
చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమా అంటే బన్నీకి చాలా ఇష్టమట. ఈ సినిమాను 15 సార్లకంటే ఎక్కువగానే చూశాడట. ఇప్పటికీ టైం దొరికినప్పుడల్లా ఈ మూవీ చూడటానికి అల్లు అర్జున్ ఇష్టపడతాడట.
అల్లు అర్జున్‌కు ఇష్టమైన ఫుడ్?
బిర్యాని
అల్లు అర్జున్‌కు ఇష్టమైన పుస్తకాలు?
డాక్టర్ స్పెన్సర్ రాసిన “Who Moved My Cheese” అనే పుస్తకం చదువుతుంటాడు. ఫొటోగ్రఫీ, స్కెచింగ్ అంటే ఇష్టమట.
అల్లు అర్జున్‌కు ఎన్ని అవార్డులు వరించాయి..?
అల్లు అర్జున్ 5 ఫిల్మ్‌ఫేర్, 3 నంది అవార్డులు సాధించాడు. పుష్ప చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!