కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఇక నుంచి ఏటా రెండు సార్లు DA, DR అలవెన్స్‌లు బెసిక్ శాలరీకి యాడ్ కానున్నాయి. జనవరి- జులైలో రివైజ్ కానున్నట్లు సమాచారం. బేస్ ఇయర్‌ను 1963-65 నుంచి 2016 సంవత్సరానికి మార్చడం జరిగింది. అలాగే కొత్త వేతన సవరణ సూచికను కేంద్రం తీసుకురానుంది. 7వ వేతన సవణ ప్రకారం 4శాతం డీఏ, మరో 4శాతం డీఆర్‌ను పెంచనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే ఉద్యోగుల DAను 4 శాతం పెంచింది. దీంతో అప్పటివరకు 38% గా ఉన్న DA అలవెన్స్ 42 శాతానికి పెరిగింది. కానీ ఈసారి ఏకంగా 8శాతం పెరగొచ్చని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఉద్యోగుల DA అలవెన్స్ 50శాతానికి పెరుగుతుంది. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి భారీగా లాభపడే ఛాన్స్ ఉంది. ఒక ఉద్యోగి బేసిక్ పే రూ. 20,000 గా ఉంటే DA అలవెన్స్ కింద రూ.10,000 రావాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే జులైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద శుభవార్త వింటారని వార్తలు ఊపందుకున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు కూడా ఉండటంతో DA హైక్ ఖాయమని ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!