దేవర సక్సెస్‌తో జూ. ఎన్టీఆర్ తెగ ఖుషీ అవుతున్నారు. రూ.500 కోట్ల దిశగా దూసుకుపోతుండటంతో అటు ఫ్యాన్స్ సైతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే సినిమాలను ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ సాగే నటుల్లో తారక్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఏమాత్రం సమయం దొరికిన తన ఇద్దరు కుమారులతో తీరిక లేకుండా గడిపేస్తుంటారు. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీల తారక్ ఏంజలిస్ వెళ్లారు. అక్కడ తన కుమారులు అభయ్, భార్గవ్ సినీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిడ్డల సినీ ఎంట్రీపై తారక్ ఏమన్నారంటే!
టాలీవుడ్‌కు చెందిన పెద్ద కుటుంబాల్లో నందమూరి ఫ్యామిలీ ఒకటి. నందమూరి తారకరామారావు నటవారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. హరికృష్ణ తనయుడు తారక్ సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల అమెరికా వెళ్లిన తారక్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. భవిష్యత్‌లో మీ పిల్లల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తారా? అని ప్రశ్నించగా తారక్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. తన అభిప్రాయాలను పిల్లలపై రుద్దనని సొంత ఆలోచనలను వారు కలిగి ఉండాలని తారక్ అన్నారు. కాబట్టి సినిమాల్లోకి రావాలని వాళ్లను బలవంతం చేయని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా తనను ఎప్పుడు బలవంతం చేయలేదన్నారు. అయితే తండ్రిని నటుడిగా చూసినప్పుడు ఆ బాటలోనే అడుగులు వేయాలని పిల్లలు కోరుకుంటారని ఫ్యాన్స్‌కు తారక్ హింట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అభయ్, భార్గవ్ సినిమా ఎంట్రీని ఎక్స్పెక్ట్ చేయోచ్చని కామెంట్స్ చేస్తున్నారు.
తారక్.. నందమూరి వారసుడు కాదా?
ఇటీవల అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ వారసులు ఎవరు? అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నించగా దీనికి బాలయ్య ఊహించని సమాధానం ఇచ్చారు. తన కొడుకు మోక్షజ్ఞ, తన మనవడు వారసులుగా ఉంటారని సమాధానం ఇచ్చారు. ఇంతకు మించి ఎవరున్నారు? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. వారసులపై బాల్యయ్య ఇచ్చిన ఆన్సర్ సరైందే అయినప్పటికీ ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పేర్లను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఎన్ని విభేదాలు ఉన్నా వారు కూడా నందమూరి ఫ్యామిలీనే కదా అంటూ కామెంట్స్ చేశారు. అటు తారక్ ఫ్యాన్స్ సైతం బాలయ్య కామెంట్స్‌పై నెట్టింట మండిపడ్డారు. మీ దృష్టిలో తారక్ నందమూరి వారసుడు కాదా? అని నిలదీశారు.
హరికృష్ణ మరణంతో పెరిగిన దూరం!
నందమూరి తారక రామారావు నట వారసులుగా బాలయ్య, హరికృష్ణ తెలుగు తెరపై అడుగుపెట్టారు. వాస్తవానికి బాలయ్య కంటే ముందే హరికృష్ణ బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే తండ్రి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. నాన్న వెన్నంటే పొలిటిక్స్‌లో ప్రచార యాత్రల్లో పాల్గొన్నారు. అయితే బాలకృష్ణ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ సంపాదించారు. హరికృష్ణ బతికి ఉన్నంతవరకూ ఆయన కుమారులైన తారక్, కల్యాణ్ రామ్‌కు నందమూరి ఫ్యామిలీలో మంచి రిలేషనే ఉంది. బాలయ్య సైతం వారిద్దరితో ఎంతో అప్యాయంగా ఉండేవారు. హరికృష్ణ మరణాంతరం చోటుచేసుకున్న కొన్ని ఘటనల వల్ల బాలయ్యకు తారక్‌కు మధ్య దూరం పెరిగిందని సమాచారం. ప్రస్తుతం జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒక్కటిగా ఉంటున్నారు. తారక్ నందమూరి కుటుంబానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ బాలయ్య అందుకు అంగీకరించడం లేదన్న విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి.
‘దేవర 2’.. తారక్ ఏం చెప్పారంటే?
కలెక్షన్స్ పరంగా దేవర సాలిడ్ విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి సీక్వెల్‌పై పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘దేవర 2’పై తారక్ స్పందించాడు. ‘మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే పార్ట్2లో కొన్ని సన్నివేశాలు షూట్ చేశాం. ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించడంతో మాలో మరింత ఉత్సాహం పెరిగింది. బాధ్యత పెరిగింది. దేవర కంటే రాబోయే సీక్వెల్ ఇంకా బాగుంటుంది. దీన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయడానికి మేం కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ రెడీగా ఉంది. దానిని ఇంకా బెటర్‌గా షేపప్ చేయాలి. దేవర కోసం కొరటాల శివ ఎంతో కష్టపడ్డారు. అందుకే ఓ నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పా. ఏమీ ఆలోచించకుండా ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేసి రమ్మన్నాను. ఆ హాలీడేస్ నుంచి వచ్చాక మిగతా పనులు మొదలుపెడతాం’ అని తారక్ అన్నారు.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్