• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pawan Kalyan: ‘సలార్‌’లో ప్రభాస్ లాగే ‘ఓజీ’లో పవన్‌ కూడా… ఫ్యాన్స్‌లో తగ్గిపోతున్న హైప్‌!

    టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న హీరోల జాబితాలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ముందు వరుసలో ఉంటాడు. ఆయన కొత్త సినిమా వస్తుందంటే ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంటుంది. కానీ, పవన్‌ కల్యాణ్‌ నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్‌ ఇండియా చిత్రం రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో పవన్‌ లేటెస్ట్‌ మూవీ ‘ఓజీ’ (OG) జాతీయ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం ‘సలార్‌’.. పవన్‌ ‘ఓజీ’ మూవీకి ఓ కనెక్షన్‌ ఉందంటూ నెట్టింట ఓ వార్త వైరల్‌ అవుతోంది. అలాగే పవన్‌ తదుపరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) గురించి కూడా ఓ రూమర్‌ హల్‌చల్‌ చేస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    ఓజీ – సలార్‌ మధ్య పోలిక!

    ‘కేజీఎఫ్‌’ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌’ (Salaar) చిత్రంలో హీరో ప్రభాస్‌ (Prabhas) పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. దాదాపు మూడు గంటలు ఉండే ఈ చిత్రంలో ప్రభాస్ కనిపించేది సుమారు గంట మాత్రమే. మిగతా రన్ టైమ్‌లో ప్రభాస్‌పై ఎలివేషన్‌లు, ఇతర పాత్రలు, సినిమా కథ వంటివి కనిపించాయి. అయితే పవన్‌ అప్‌కమింగ్‌ మూవీ ‘ఓజీ’లోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్‌ కానున్నట్లు తెలుస్తోంది. సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజీ’లో పవన్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌ తక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే సినిమా ప్రారంభమైన తొలినాళ్లలోనే పవన్‌ రెగ్యులర్‌ షూట్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో షూటింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చాడు. పవన్‌ పాత్రకు సంబంధించి మిగిలిన షూటింగ్‌కు రెండు వారాల సమయం సరిపోతుందని టాక్‌ వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే పవన్‌ పాత్ర నిడివి ‘ఓజీ’లో పరిమితంగా ఉండొచ్చనే అభిప్రాయానికి సినీ వర్గాలు వస్తున్నాయి. 

    హై రేంజ్‌లో ఎలివేషన్స్‌!

    ‘ఓజీ’ సినిమాలో పవన్‌ పాత్ర నిడివి తక్కువగా ఉన్నా.. ఎలివేషన్స్‌ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయని మూవీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఓజీ’ గ్లింప్స్‌ చూస్తే ఈ విషయం ప్రతీ ఒక్కరికీ అర్థమవుతోంది. ఇందులో పవన్‌ను.. ఓ రేంజ్‌లో చూపించాడు డైరెక్టర్‌. గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో పవన్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. దీంతోపాటు ఓజీ నుంచి వచ్చి ‘హంగ్రీ చీతా’ సాంగ్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ సాంగ్‌ను పవన్‌ ఫ్యాన్స్‌ తమ కాలర్‌ ట్యూన్స్‌, రింగ్‌టోన్స్‌గా పెట్టుకోవడం విశేషం. ఇక ఈ భారీ చిత్రంలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌ పాత్ర పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. 

    సన్నగిల్లుతున్న అంచనాలు!

    పవన్‌ కల్యాణ్‌ హీరోగా.. దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్న మరో చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్‌లో మంచి హైప్‌ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమై నాలుగేళ్ల గడిచినా ఎటువంటి సాలిడ్‌ అప్‌డేట్‌ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరుస్తోంది. సినిమా షూటింగ్‌ వాయిదా మీదా వాయిదా పడుతుండటంతో పాటు అరకొరగా అప్‌డేట్స్‌ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి సన్నగిల్లుతోంది. శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఓ ప్రోమో రిలీజ్‌ చేస్తామని ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించినప్పటికీ ఇవాళ్టికి కూడా దానిపై ఎలాంటి అలెర్ట్ లేకపోవడం గమనార్హం. దీంతో పవన్‌ కెరీర్‌లో ప్రిస్టేజియస్‌ ప్రాజెక్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘హరిహర వీరమల్లు’.. ‘ఓజీ’ చిత్రంతో పోలిస్తే చాలా లో బజ్‌లోకి వెళ్లిపోతోంది. 

    చిరుకు పోటీగా పవన్‌ కల్యాణ్‌!

    హరిహర వీరమల్లు’ షూటింగ్‌ వాయిదాల మీద వాయిదా పడుతుండటంతో అసలు ఈ సినిమా రిలీజ్‌ అవుతుందా? అన్న ప్రశ్న ఫ్యాన్స్‌లో ఏర్పడింది. దీంతో ఇటీవల మేకర్స్‌ స్పందిస్తూ ఈ సినిమా ఆగలేదని, షూటింగ్‌ అయినంతవరకూ పోస్ట్‌ ప్రొడక్షన్, VFX వర్క్స్‌ జరుగుతున్నాయని ప్రకటించారు. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ఏపీ ఎన్నికల తర్వాత పవన్‌ డేట్స్‌ ఇస్తే డిసెంబర్‌లోగా షూటింగ్‌ పూర్తి చేయాలని వారు భావిస్తున్నారట. తద్వారా సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్‌ చేస్తున్నారట. అదే జరిగితే ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని ‘హరిహర వీరమల్లు’ ఢీకొట్టాల్సి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv