ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతపెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇందులో సమంత చేసిన ‘ఊ అంటావా ఊఊ అంటావా’ ఐటెం సాంగ్ యావత్ దేశాన్ని ఉర్రూతలూగించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ ఈ తరహా ఐటెంగ్ సాంగ్‌ను సుకుమార్ ఏర్పాటు చేశాడు. ఈసారి సమంత ప్లేసులో శ్రీలీల ఈ స్పెషల్ సాంగ్ చేస్తోంది. తాజాగా సాంగ్ (Pushpa 2 Item Song) షూట్ కూడా మెుదలవ్వగా సెట్ నుంచి ఓ ఫొటో లీకయ్యింది. ఇందులో శ్రీలీల లుక్‌ను చూసిన అభిమానులు పెదవి విరుస్తున్నారు. అందుకు గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
బన్నీ, శ్రీలీల పిక్ లీక్!
అల్లు అర్జున్ హీరోగా చేస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ప్రస్తుతం ఈ సినిమాలోని ఐటెం సాంగ్ (Pushpa 2 Item Song)ను షూట్ చేస్తున్నారు. బన్నీ, శ్రీలీలపై ఈ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ సాంగ్ షూట్‌కు సంబంధించి ఓ పిక్ నెట్టింట ప్రత్యక్షమ్యయింది. బన్నీ, శ్రీలీల స్టెప్ వేస్తున్న ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో అల్లు అర్జున్ ఎరుపు రంగు డ్రెస్‌లో కనిపించాడు. అటు శ్రీలీల నలుపు రంగు డ్రెస్‌లో ఆకట్టుకుంది. ఎద, నడుము అందాలు చూపిస్తూ సాంగ్ కోసం గ్లామరస్‌గా మేకోవర్ అయ్యింది. ‘కిస్సిక్’ (Kissick Song) అంటూ ఈ ఐటెమ్ సాంగ్ సాగనుందని ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది. ఈ సాంగ్ ‘ఊ అంటావా’ సాంగ్ కు మించి అదరిపోద్దంటూ బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అటు ఈ ఫోటో లీక్‌పై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు.
నిరాశలో నెటిజన్లు!
‘పుష్ప’ ఐటెం సాంగ్‌లో సమంత (Samantha) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లుక్స్ పరంగా, డ్యాన్స్ పరంగా సమంత ఇరగదీసింది. ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ సాంగ్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ కావడంలో సమంత కీలకపాత్ర పోషించింది. సెకండ్ పార్ట్‌లోనూ ఆ తరహా పాట (Pushpa 2 Item Song) ఉంటుందని ప్రచారం జరుగుతుండటంతో సహజంగానే ఈ స్పెషల్ సాంగ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీలీలను ఎంపిక చేశారన్న వార్తలు రాగానే ఆడియన్స్‌లో ఆనందం మరింత పెరిగింది. అయితే తాజాగా లీకైనా ఫొటోను చూడగానే తమ ఆశలు ఆవిరయ్యాయని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సమంతకు మించిన లుక్స్‌లో హాట్‌గా శ్రీలీల అలరిస్తుందని భావించిన తమకు నిరాశే ఎదురైందని వాపోతున్నారు. కనీసం సమంత లుక్స్‌ను కూడా శ్రీలీల మ్యాచ్ చేయలేకపోయిందని పోస్టులు పెడుతున్నారు. సాధారణ పాటలకు వేసుకునే డ్రెస్ లాగే అమె కాస్ట్యూమ్ ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
డ్యాన్స్ మాత్రం అదిరిపోవాల్సిందే!
‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌లో శ్రీలీల లుక్స్‌ను ఎలా ఉన్నప్పటికీ డ్యాన్స్ మాత్రం అదిరిపోతుందని చెప్పవచ్చు. ప్రస్తుత తరం కథానాయికల్లో డ్యాన్స్‌లో శ్రీలీలను కొట్టేవారే లేరనడంతో అతిశయోక్తి లేదు. ఈ భామ తన నటన కంటే డ్యాన్స్ పరంగానే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. రవితేజ ‘ధమాకా’ చిత్రంలో పల్సర్ బైక్ సాంగ్‌లో ఈ అమ్మడు ఏవిధంగా అదరగొట్టిందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా మహేష్ బాబుతో ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్‌లో ఏకంగా తన స్టెప్పులతో విధ్వంసం సృష్టించింది. శ్రీలీలతో డ్యాన్స్ అంటే హేమా హేమీ డ్యాన్సర్లు సైతం కాస్త వెనక్కి తగ్గుతుంటారు. అటువంటి శ్రీలీలతో డ్యాన్స్‌కు కేరాఫ్‌గా నిలిచే బన్నీ జతకలిస్తే ఇక ఐటెం సాంగ్ ఏ స్థాయిలో ఉంటుందో అభిమానుల ఊహకే వదిలేయవచ్చు.
ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్
‘పుష్ప 2’ చిత్రం వరల్డ్ వైడ్‌గా 10 వేలకు పైగా థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. భారత్‌లో 6500 స్క్రీన్స్‌లో పుష్పగాడు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ ఏకంగా 5000 స్క్రీన్స్‌లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు టాక్. అదే జరిగితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రంగా ‘పుష్ప 2’ రికార్డు సృష్టించనుంది. ఇక అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఎలమంచిలి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 4న ఓవర్సీస్‌లో తర్వాతి రోజు పాన్ ఇండియా స్థాయిలో ‘పుష్ప 2’ రిలీజ్ కానుంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ