• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • PVCU 3: కాళికాదేవి శక్తితో మహిళా సూపర్‌ హీరో.. ప్రశాంత్‌ వర్మ గట్టిగానే ప్లాన్‌ చేశాడుగా! 

    ‘హనుమాన్‌’ (Hanuman) చిత్రంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. పెద్దగా అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్‌ పాన్‌ ఇండియా స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించింది. దర్శకుడిగా ప్రశాంత్‌ వర్మ పనితీరుపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇదిలా ఉంటే తన సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) నుంచి ప్రతి ఏడాది ఓ సినిమా వస్తుందని ప్రశాంత్‌ వర్మ గతంలోనే చెప్పారు. ఇందుకు అనుగుణంగా  PVCU నుంచి అదిరిపోయే ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశాడు. 

    ‘మహా కాళీ’ ప్రాజెక్ట్‌

    ‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ మూవీకి ‘మ‌హా కాళీ’ (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్‌ రివీల్‌ చేస్తూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. భార‌తీయ సినీ ప్ర‌పంచంలో మొద‌టి మ‌హిళా సూప‌ర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మ‌హిళా ద‌ర్శ‌కురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వ‌హిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

    పోస్టర్‌లో ఇవి గమనించారా?

    ‘మ‌హా కాళీ’ పోస్టర్‌ ని గమనిస్తే ‘ఒక బాలిక తన తలను పులికి సున్నితంగా తాకినట్లు చూపించారు. బ్యాగ్రౌండ్‌లో గుడిసెలు, దుకాణాలు దర్శనమివ్వడంతో ప్రజలు ఎంతో భయాందోళనతో పెరిగెడుతూ కనిపించారు. అలాగే పోస్టర్‌లో ఒక ఫెర్రిస్ వీల్ మంటల్లో చిక్కుకున్నట్లు చూపించారు. అంతేకాకుండా టైటిల్‌ను బెంగాలీ ఫాంట్‌లో డిజైన్ చేయడం, డైమండ్ లాంటి ఆకారాన్ని మధ్యలో ఉంచడం ఆసక్తిరేపుతోంది. ప్రశాంత్‌ వర్మ యూనివర్స్‌ నుంచి రానున్న ఈ చిత్రం ఈసారి ఎలాంటి మ్యాజిక్‌ చేయబోతుందోనన్న ఆసక్తి అందరిలోనూ మెుదలైంది. కాగా ఈ సినిమాకి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ IMAX 3Dలో భారతీయ, విదేశీ భాషలలో విడుద‌ల చేయ‌నున్నట్లు ప్రకటించారు.

    కాళికాదేవి శక్తితో..

    మహాకాళి ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఎక్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్‌ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో మహా కాళిపై ఒక్కసారిగా హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇందులో సూపర్ ఉమెన్‌ పాత్ర ఏ హీరోయిన్‌ పోషిస్తుందా? అన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. స్టార్‌ హీరోయిన్‌ను తీసుకుంటారా? లేదా కొత్త వారికి ఛాన్స్ ఉంటుందా? అన్న చర్చ నెట్టింట జరుగుతోంది. 

    ‘జై హనుమాన్‌’ కంటే ముందే..

    తన సినిమాటిక్‌ యూనివర్స్‌కు సంబంధించి 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని స్పష్టం చేశారు. ‘జై హనుమాన్‌’ కంటే ముందు ‘అధీర’, ‘మహాకాళీ’ సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటు నందమూరి వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నట్లు కూడా ఇటీవలే తెలిపారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్‌ వర్మ దూకుడు చూస్తుంటే ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది. 

    మోక్షజ్ఞ సినిమాలో బిగ్‌బీ!

    బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ‘PVCU 2’ ప్రాజెక్ట్‌ రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి కోసం పాన్‌ ఇండియా సబ్జెక్ట్‌ను సైతం ప్రశాంత్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ కీలక పాత్రకు బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను తీసుకోవాలని ప్రశాంత్‌ వర్మ భావిస్తున్నారట. ఆ పాత్రకు బిగ్‌ బీ అయితేనే పూర్తిగా న్యాయం చేస్తారని డైరెక్టర్‌ నమ్ముతున్నారట. అమితాబ్‌ను తీసుకోవడం ద్వారా బాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వాలని ప్రశాంత్ వర్మ చూస్తున్నట్లు సమాచారం. కాగా, ఇందులో అభిమన్యుడి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv