మెగా పవర్ రామ్‍చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అటు ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతోనూ రామ్‌చరణ్ చిత్రం ఖరారైంది. స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ‘RC16’ చిత్రానికి ఇటీవలే పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. అయితే తాజాగా రామ్‌చరణ్‌కు సంబంధించి మరో మూవీ కన్ఫార్మ్ అయ్యింది. ‘పుష్ప’ లాంటి బ్లాక్‌బాస్టర్ ఇచ్చిన సుకుమార్.. ‘RC17’ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు విడుదలైంది.
హోలీ స్పెషల్ అనౌన్స్‌మెంట్..
రామ్‍చరణ్ – సుకుమార్ కాంబినేషన్‍లో భారీ సినిమా తెరకెక్కనుందని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నేడు అధికారికంగా వెల్లడించింది. హోలీ సందర్భంగా చెర్రీ, సుకుమార్ రంగులు పూసుకొని సెలెబ్రేట్ చేసుకున్న ఫొటోను ట్వీట్ చేసింది. అలాగే జోడు గుర్రాల పోస్టర్‌తో ‘రోరింగ్ టూ కాంకర్’ అనే ట్యాగ్ లైన్ మరో పోస్టర్‌ను కూడా నిర్మాణ సంస్థ పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సుకుమార్ లాంటి దిగ్గజ దర్శకుడితో రామ్‌చరణ్ మళ్లీ పనిచేయనుండటంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
రంగస్థలం కాంబో రిపీట్!
సుకుమార్ – రామ్‌చరణ్ కాంబోలో గతంలోనే ఈ సినిమా వచ్చింది. 2018లో వచ్చిన పీరియడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘రంగస్థలం’ భారీ విజయాన్ని అందుకుంది. నటుడిగా చెర్రీని మరోస్థాయికి తీసుకెళ్లింది. అప్పటి వరకు క్లాస్ సినిమాలతో మెప్పించిన సుకుమార్.. రంగస్థలంతో మాస్ అంటే ఏంటో చూపించారు. ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పుడు ‘ఆర్‌సీ17’ చిత్రానికి ఈ హిట్ కాంబినేషన్ మొత్తం రిపీట్ అవుతోంది.
రిలీజ్ ఎప్పుడంటే?
రామ్చరణ్ – సుకుమార్ కాంబోలో రూపొందనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని… 2025 రెండో అర్ధభాగంలో రిలీజ్ చేసేలా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబుతో సినిమా పూర్తయ్యాక వెంటనే ఈ మూవీ షూటింగ్‍లో చెర్రీ పాల్గొనే ఛాన్స్ ఉంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం