• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Sania Mirza: సానియా మీర్జా – షోయాబ్‌ విడిపోవడానికి అసలు కారణం ఇదేనా?

  స్టార్‌ కపుల్స్‌ సానియా మిర్జా – షోయబ్‌ మాలిక్ జంట అధికారికంగా విడిపోయింది. ఈ జంట విడిపోతున్నట్లు గత కొన్నేళ్లుగా షికారు చేస్తున్న పుకార్లను నిజం చేస్తూ పాక్‌ మాజీ కెప్టెన్‌ షోయాబ్‌ మాలిక్‌ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించడంతో పాటు వివాహ ఫొటోలను షేర్‌ చేయడంతో అవి ట్రెండింగ్‌గా మారాయి. 

  పాక్‌ నటి సనా జావేద్‌ను షోయాబ్‌ మాలిక్‌ పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశాడు. గత ఏడాది సనా జావేద్‌(sana javed)కు షోయబ్‌ బర్త్‌డే విషెస్‌ చెప్పారు. అప్పటి నుంచి వీరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అంతకుముందు నుంచే షోయాబ్‌-సానియా కూడా విడిపోతున్నట్లు ప్రచారం జరిగింది. 

  ఫొటోలు తొలగింపు

  టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2010లో పాక్ క్రికెటర్‌ షోయబ్ మాలిక్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇజాబ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొంత కాలంగా సానియా పాకిస్థాన్‌లో కంటే ఇండియాలోనే ఎక్కువగా ఉంటోంది. దీనికి తోడు షోయాబ్‌ తన ట్విటర్‌ ఖాతా రిలేషన్‌షిప్‌ స్టేటస్‌లో సానియా పేరు తీసేయడం, ఆమె కూడా ఇన్‌స్టా నుంచి అతడి ఫొటోలు తొలగించడంతో పుకార్లు షికారు చేశాయి. 

  ‘విడాకులు చాలా కష్టం’

  సానియా మీర్జా, షోయబ్ మాలిక్ క్రీడా ప్రపంచంలో అందమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వారి వివాహ సమస్యల గురించి తరచూ వార్తలు రావడంతో అందరి దృష్టి ఈ జంటపై పడింది. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం ‘విడాకులు చాలా కష్టం.. ఒకరి హృదయంలో శాంతిని కొనసాగించడం ఇంకా కష్టం’ అంటూ సానియా చేసిన సోషల్‌ మీడియా పోస్టు వారి మధ్య ఉన్న వివాదాలను మరింత బహిర్గతం చేసింది. 

  షోయాబ్‌కు ఇది మూడోది!

  సానియా పోస్టు వైరల్‌గా మారిన తరుణంలోనే షోయాబ్‌ మరో వివాహం చేసుకున్నట్లు ప్రకటన చేశాడు. ఆయనకు ఇది మూడో పెళ్లి కావడం గమనార్హం. 2010లో ఆయేషాతో విడాకులు తీసుకున్న అతడు.. అదే ఏడాది సానియాను వివాహమాడాడు. ఆ వేడుక అప్పట్లో అందర్నీ ఆకర్షించింది. 2018లో సానియా – షోయాబ్‌ జంటకు కుమారుడు జన్మించాడు. దయాది దేశాలకు చెందినప్పటికీ ఇరువురు కొన్నేళ్ల పాటు ఎంతో అనోన్యంగా గడిపారు. కాలక్రమేణ వారిరువురు మధ్య సమస్యలు తలెత్తాయి. 

  విడిపోవడానికి ప్రధాన కారణం ఇదేనా?

  షోయాబ్‌- సానియా వైవాహిక సమస్యలకు ప్రధాన కారణం.. వారి వృత్తిపరమైన జీవితమని తెలుస్తోంది. ఇద్దరికి విభిన్న క్రీడా నేపథ్యం ఉండటంతో పాటు వేర్వేరు దేశాలకు ప్రాతినిథ్యం వహించడం వల్ల వారి మధ్య తరచూ సమస్యలు తలెత్తినట్లు సమాచారం. ఇద్దరూ తమ టోర్నీల్లో నిమగ్నం కావడంతో ఈ జంట మధ్య కాస్త గ్యాప్‌ వచ్చినట్లు సన్నిహితులు చెబుతున్నారు. పైగా దయాది దేశమైన భారత్‌కు ఆమె టెన్నిస్‌లో ప్రాతినిథ్యం వహించడం షోయాబ్‌ కుటుంబ సభ్యులకు నచ్చలేదని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. పాకిస్థాన్‌ తరఫున టెన్నిస్ ఆడాలని ఆదేశ ప్రభుత్వం కోరినా, షోయబ్ నచ్చజెప్పిన సానియా భారత్‌ తరఫున ఆడుతానని అప్పట్లో స్పష్టం చేసింది. 

  ఆ విషయంలో మనస్పర్థలు!

  అత్తింటి వారి నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ సానియా దేశం తరుపున ఆడేందుకే సంసిద్దత వ్యక్తం చేసింది. దీంతో షోయాబ్‌, సానియాలతో పాటు వారి కుటుంబాల మధ్య కూడా మనస్పర్థలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో షోయాబ్‌.. నటి జావేద్‌తో సన్నిహితంగా మెలగడం వారి మధ్య మరింత దూరాన్ని పెంచినట్లు తెలుస్తోంది. వారు డేటింగ్‌లో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా షోయాబ్‌, సనా జావేద్‌ ఇద్దరూ ఖండించకపోవడం సానియాకు మరింత ఆగ్రహం తెప్పించి ఉండొచ్చని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె తన అత్తింటికి దూరంగా ఇండియాకు వచ్చేశారని అంటున్నారు. 

  సనాకు ఇంతకుముందే పెళ్లి!

  మరోవైపు షోయాబ్ మూడో భార్య సనా జావేద్‌కు కూడా ఇంతకుముందే వివాహం జరిగింది. ఆమె 2020 అక్టోబర్‌లో పాకిస్థానీ నటుడు, గాయకుడు ఉమైర్ జస్వాల్‌ని వివాహం చేసుకుంది. అయితే వారు వెంటనే విడివిడిగా జీవించడం ప్రారంభించారు. సనా, ఉమైర్ కూడా తమ ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించారు.

  సనా జావేద్ ఇంతకు  ఏవరంటే? (Who is Sana Javed?)

  సనా జావేద్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె సౌదీ అరేబియాలోని జెడ్డాలో 1993 మార్చి 25న జన్మించింది. ఉర్దూ టెలివిజన్‌ రంగంలో మంచి పేరు తెచ్చుకుంది. యూనివర్సిటీ ఆఫ్ కరాచీ నుంచి పట్టభద్రురాలైన ఆమె 2012లో ‘షెహర్-ఎ-జాత్’తో రంగప్రవేశం చేసింది. అప్పటి నుంచి ఖానీ, రుస్వాయి, డంక్ వంటి నాటకాలలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv