• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • The 7 immortals Of Kalki: కల్కీ సినిమాలో సప్త చిరంజీవులు.. కథకు అసలు మూలం వీరేనా?

    చిరంజీవులు అంటే ఎప్పటికీ మరణం లేని వారని మనకు తెలిసిన విషయమే. పురణాల్లో వీరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. వారు ఇప్పటికీ హిమాలయాల్లో జీవించి ఉన్నారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నట్లు అని ఆలోచిస్తున్నారా? ఇందుకు బలమైన కారణమే ఉంది. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)లో ఈ చిరంజీవులే సూపర్‌ హీరోలుగా కనిపించబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. పురణాల్లోని అశ్వత్థామ పాత్రను అమితాబ్‌ బచ్చన్‌ పోషిస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇంతకీ చిరంజీవులు ఎంత మంది? కల్కి సినిమాల్లో ఆ పాత్రలను ఎవరు పోషిస్తే బాగుంటుంది? ఆ వివరాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. 

    సప్త చిరంజీవులు ఎవరంటే?

    పురణాలు ప్రకారం అశ్వత్థాముడు (Ashwathama), బలి చక్రవర్తి (Bali Chakravarthi), హనుమంతుడు (Hanuman), విభీషణుడు ((Vibhishana), కృపాచార్యుడు (Kripudu), పరశురాముడు (Parasuramudu), వ్యాసుడు (Vyasudu) అనబడే ఈ ఏడుగురిని సప్త చిరంజీవులుగా పిలుస్తుంటారు. వారు ఇప్పటికీ భూమి మీద.. మానవ మాత్రులకు కనిపించకుండా జీవిస్తున్నట్లు హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ శాపం వల్ల అశ్వత్థాముడు.. వామనుని అనుగ్రహము వల్ల బలి చక్రవర్తి చిరంజీవులు అయ్యారు. అలాగే లోకహితము కొరకు వ్యాసుడు, శ్రీరామునిపై భక్తితో హనుమంతుడు, రాముని అనుగ్రహం వల్ల విభీషణుడు మరణం లేకుండా జీవించే వరం పొందారు. మరోవైపు విచిత్రమైన జన్మం కలగడం వలన కృపుడు, ఉత్క్రుష్టమైన తపోశక్తి కలగడంతో పరశురాముడు చిరంజీవులు అయ్యారు. వీరందర్ని సప్త చిరంజీవులుగా మన పురణాలు పేర్కొన్నాయి. 

    కల్కి సినిమాలో సప్త చిరంజీవులు?

    ప్రభాస్ అప్‌కమింగ్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో.. ఈ సప్త చిరంజీవుల పాత్రలు ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే అశ్వత్థామ పాత్రను బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ పోషిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అటు హీరో ప్రభాస్‌ విష్ణుమూర్తి అవతారమైన పరుశురాముడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన పాత్రలకు ఎవర్ని ఫైనల్‌ చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అమితాబ్‌ లాంటి సీనియర్‌ నటుడ్ని అశ్వత్థామ పాత్రకు తీసుకోవడంతో మిగిలిన వాటికి కూడా దిగ్గజ నటులను తీసుకుంటే బాగుంటుందని సినిమా లవర్స్‌ భావిస్తున్నారు. హనుమాన్‌ పాత్రకు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi), విభిషణుడిగా రజనీకాంత్‌ (Rajinikanth), బలి చక్రవర్తిగా మోహన్‌లాల్‌ (Mohanlal), వ్యాసుడిగా కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ (Shiva Rajkumar), కృపుడిగా బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అనిల్‌ కపూర్‌ (Anil Kapoor) సరిగ్గా సరిపోతారని అంచనా వేస్తున్నారు. మరోవైపు కల్కీలో పాత్రల కోసం నాని (Nani), విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు రూమర్లు ఉన్నాయి. మరి చివరికీ ఏం జరుగుతుందో చూడాలి. 

    కమల్‌కు భారీ రెమ్యూనరేషన్‌

    కల్కి చిత్రంలో దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ ‘కాళి’ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా కమల్‌ పాత్ర ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. కమల్‌ ఈ పాత్ర కోసం భారీగా రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. కమల్‌కు ఏకంగా రూ.50 కోట్లు చిత్ర యూనిట్‌ చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బిగ్‌బీ అమితాబ్‌ పాత్రకు రూ.10 కోట్లు చెల్లించినట్లు సమాచారం అందుతోంది. కమల్‌తో పోలిస్తే అమితాబ్ అశ్వత్థామ పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో ఈ మాత్రం చెల్లించినట్లు బాలీవుడ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీలు దీపికా పదుకొనే, దిశా పటాని నటిస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv