గోపీచంద్‌కు రజినీకాంత్ ఫోన్; ఎందుకో తెలుసా?
‘వీరసింహారెడ్డి’ డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి సూపర్‌స్టార్ రజినీకాంత్ ఫోన్ కాల్ చేశారు. ‘వీరసింహారెడ్డి’ మూవీ తనకెంతగానో నచ్చిందని గోపీని రజినీకాంత్ మెచ్చుకున్నారు. సినిమా మేకింగ్ అద్భుతంగా తీశారని ప్రశంసించారు. దీనికి స్పందనగా గోపీచంద్.. ‘‘రజినీ సర్ ప్రశంసల కంటే నాకు ఈ ప్రపంచంలో విలువైనది ఇంకేదీ లేదనిపిస్తోంది. థాంక్యూ రజినీ సర్.’’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా ‘వీరసింహారెడ్డి’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే.