• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VD12 : హ్యాట్రిక్‌ ఫ్లాప్స్‌ నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ డేరింగ్‌ డెసీషన్‌..? కెరీర్‌లోనే తొలిసారి!

    టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న యంగ్‌ హీరోల్లో ‘విజయ్‌ దేవరకొండ’ (Vijay Devarakonda) ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా అతడ్ని ఫ్యాన్స్‌ అభిమానిస్తుంటారు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్‌ లేక విజయ్‌ ఇబ్బంది పడుతున్నాడు. విజయ్‌ గత మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడ్డాయి. దీంతో రాబోయే చిత్రం విజయ్‌కు చాలా కీలకంగా మారింది. విజయ్‌ తన తర్వాతి చిత్రాన్ని గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి సెన్సేషనల్‌ అప్‌డేట్‌ బయటకొచ్చింది. అది విన్న విజయ్‌ ఫ్యాన్స్‌ తమ హీరో డేరింగ్‌ డెసిషన్‌కు ఆశ్చర్యపోతున్నారు. 

    డేరింగ్‌ డేసిషన్‌ ఏంటంటే?

    విజయ్‌ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) కాంబోలో రానున్న ‘VD12’ చిత్రం.. యాక్షన్‌ డ్రామాగా రూపొందనుంది. విజయ్‌ రీసెంట్‌ చిత్రాలు ‘లైగర్‌’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్‌’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడటంతో.. ప్రస్తుతం అతడి ఫోకస్‌ మెుత్తం ఈ సినిమా పైనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకోవాలని విజయ్‌ దృఢసంకల్పంతో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘VD12’ సక్సెస్‌ కోసం ఎంతైన కష్టపడాలని అతడు నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం విజయ్.. ఈ సినిమా కోసం ఓ డేరింగ్‌ డెసిషన్‌ తీసుకున్నాడు. ఈ సినిమాలో ఒక్క పాట లేకుండా నటించేందుకు అతడు సిద్ధపడ్డాడట.

    సాంగ్స్ ఎందుకు వద్దంటే?

    విజయ్‌ దేవరకొండ సినిమాలకు హిట్‌ ఆల్బమ్స్‌గా పేరుంది. అతడి ప్రతీ సినిమాలో కనీసం రెండు, మూడు సాంగ్స్‌ అయినా సూపర్‌ హిట్‌గా నిలుస్తుంటాయి. అటువంటిది ‘VD12’లో సాంగ్స్‌ వద్దని చిత్ర యూనిట్‌ భావిస్తుండటం అందరికీ షాకింగ్‌గా అనిపిస్తోంది. అయితే ఇందుకు ఓ బలమైన కారణం ఉన్నట్లు టాలీవుడ్‌లో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో విజయ్‌ తొలిసారి పోలీసు ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్టులో పాటలు పెడితే కథనం, మూవీ ఫ్లేవర్‌ దెబ్బతింటాయని డైరెక్టర్‌ గౌతమ్‌ భావిస్తున్నారట. దీంతో పాటలు లేకుండానే ప్రాజెక్ట్ కంప్లీట్‌ చేద్దామని విజయ్‌తో ఆయన అన్నాడట. ఇందుకు విజయ్‌ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. కార్తీ నటించిన ‘ఖైదీ‘ చిత్రం కూడా గతంలో ఒక్క పాట లేకుండానే వచ్చి.. సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ చిత్రాన్నే ‘VD12’ అనుసరించనుండటం గమనార్హం.

    అనిరుధ్‌ పైనే భారం!

    ‘VD12’ చిత్రానికి మ్యూజిక్‌ సెన్సేషన్ అనిరుధ్‌ సంగీతం అందించనున్నాడు. అనిరుధ్‌ పాటలు, నేపథ్య సంగీతానికి ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ‘VD12’ను చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి అనిరుధ్‌ మ్యూజిక్ ఒక్కటి చాలని డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి భావిస్తున్నారట. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకే హైలైట్ అవుతుందని మూవీ టీమ్ నమ్ముతోంది.  మరి ఈ ప్రయోగం విజయ్‌కి కలిసొస్తుందో లేదో చూడాలి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.

    హీరోయిన్‌గా కేరళ బ్యూటీ!

    ప్రేమలు చిత్రంతో యువతరం హృదయాలను దోచుకున్న మలయాళీ బ్యూటీ ‘మమితా బైజు‘ (Mamita Baiju).. ‘VD12’లో హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ పాత్రకు శ్రీలీల (Sreeleela)ను ఎంపిక చేశారు. కొన్ని కారణాల రిత్యా ఆమె స్థానంలో మమితాను తీసుకోవాలని మేకర్స్‌ నిర్ణయించారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. కాగా, ‘VD12’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. విజయ్‌కు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళ్‌, కన్నడ భాషల్లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అయితే మలయాళం సహా నార్త్‌ ప్రేక్షకులకు ‘VD12’ చిత్రాన్ని చేరువ చేసేందుకు మమితా బైజు క్రేజ్ ఉపయోగపడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అటు ఓవర్సీస్‌లోనూ ఈ అమ్మడికి ఫాలోయింగ్‌ ఉండటంతో సినిమాకు అదనపు ప్రయోజనం చేకూరనుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv