• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Weekend OTT Suggestion: ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లింగ్‌ చిత్రాలు!

    శుక్రవారం అంటే సినిమా ప్రియులకు పెద్ద పండగే అని చెప్పవచ్చు. ఆ రోజున థియేటర్లు, ఓటీటీల్లో కొత్త సినిమాలు రిలీజై ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంటాయి. అందుకే శుక్రవారం కోసం మూవీ లవర్స్‌ వీక్‌ ప్రారంభం నుంచే ఎదురు చూస్తుంటారు. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు చిత్రాలు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని చిత్రాలు ఒకరోజు ముందే (గురువారం) రిలీజ్‌ కాగా, మరికొన్ని వీకెండ్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    భీమా (Bhimaa)

    గోపీచంద్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ‘భీమా’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 8న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. ఏప్రిల్‌ 25న ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ఓటీటీ ఆడియన్స్‌ డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney+Hotstar)లో చూడొచ్చు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో కూడా భీమా అందుబాటులో ఉంది. ఈ మూవీ ప్లాట్‌ ఏంటంటే.. బెంగళూరు, బాదామి పరిసర ప్రాంతాల్లో ఉన్న పరుశురామ క్షేత్రం దేవాలయంలో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. వాటిని పోలీసు అధికారి భీమా (గోపిచంద్‌) ఎలా ఛేదించాడు? అతడికి పరుశురామ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.

    ఓ మై గాడ్‌ 2 (OMG 2)

    బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ శివుడి పాత్రలో నటించిన ఓ మై గాడ్‌ 2 చిత్రం గతేడాది ఆగస్టులో రిలీజై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దర్శకుడు అమిత్‌ రాయ్‌ తెరకెక్కించిన ఈ మూవీ పంకజ్‌ త్రిపాఠి కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం గతంలోనే నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా హిందీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తాజాగా తెలుగు సహా మరాఠి, తమిళం, బెంగాలీ భాషల్లో ‘జియో సినిమా’ (Jio Cinema)లో స్ట్రీమింగ్‌ వచ్చింది. చిన్న పిల్లలో లైంగిక విజ్ఞానం అనే సున్నిత కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు.

    ఫ్యామిలీ స్టార్‌ (Family Star)

    విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లైటెస్ట్‌ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. థియేటర్లలో మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఏప్రిల్‌ 26న ఓటీటీలో విడుదల కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) వేదికగా ఈ సినిమాను వీక్షించవచ్చు. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. గోవ‌ర్ధ‌న్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) కుటుంబ బాధ్యతలను మోస్తూ చాలి చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఇలా సాగుతున్న అతడి జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డతారు. ఓ రోజు ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధ‌న్ చేతికందుతుంది. ఇంత‌కీ ఆ పుస్త‌కంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్ర‌భావితం చేసింది? అస‌లు ఇందు ఎవ‌రు? కుటుంబ క‌ష్టాల నుంచి గోవర్ధన్‌ గట్టెక్కాడా లేదా? అన్నది కథ.

    టిల్లు స్క్వేర్‌ (Tillu Square) 

    సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జోడిగా చేసిన ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా.. యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను సైతం అలరించేందుకు ఈ చిత్రం వచ్చేస్తోంది. ఏప్రిల్‌ 26న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా ఈ సినిమాను వీక్షించవచ్చు. ఈ మూవీ కథ ఏంటంటే.. రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.

    చుండూరు పోలీసు స్టేషన్‌ (Chunduru Police Station)

    మలయాళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ‘నాయట్టు’ చిత్రం ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. ఏప్రిల్‌ 26న ఆహా వేదికగా ఈ సినిమాను తెలుగులో వీక్షించవచ్చు. ‘చుండూరు పోలీసు స్టేషన్‌’ పేరులో ఆహా ఈ సినిమాను తీసుకొస్తోంది. ఈ మూవీనే తెలుగులో ‘కోటబొమ్మాళి పీఎస్‌‘ పేరుతో రీమేక్‌ చేశారు. కథ విషయానికి వస్తే.. ఓ సామాజిక వర్గానికి చెందిన యువ నేతతో ఏఎస్‌ఐ మణియన్‌, కానిస్టేబుల్‌ ప్రవీణ్‌ గొడవ పడతారు. కానిస్టేబుల్‌ సునీతతో కలిసి వారు ఓ ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా వారి వాహనాన్ని నడిపే డ్రైవర్‌ యువనేత బంధువును ఢీకొట్టి యాక్సిడెంట్‌ చేస్తాడు. దీంతో ఆ వ్యక్తి సామాజిక వర్గానికి చెందిన వారంతా ఆందోళనకు దిగడంతో గొడవ రాజకీయ రంగు పలుముకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ముగ్గురు పోలీసులు ఎందుకు పరారయ్యారు? వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? అన్నది కథ.

    రణ్‌నీతి: బాలాకోట్ అండ్ బియాండ్ 

    ఈ వీకెండ్‌లో రాబోతున్న ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌ ‘రణ్‌నీతి: బాలాకోట్ అండ్ బియాండ్’. ఏప్రిల్ 26 నుంచి జియో సినిమా (Jio Cinema)లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో వీక్షించవచ్చు. బాలీవుడ్ నటీనటులు జిమ్మీ షెర్గిల్, లారా దత్తా ముఖ్యపాత్రలు పోషించారు. పుల్వామా దాడి, ఆ తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఇండియా జరిపిన మెరుపు దాడుల వెనుక అసలు ఏం జరిగింది? ఈ దాడులపై పాకిస్థాన్ రియాక్షన్, అంతర్జాతీయ వేదికలపై వాళ్ల మొసలి కన్నీరులాంటి అంశాలన్నింటినీ ఈ సిరీస్ లో చూపించే ప్రయత్నం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv