సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై నటుడు, ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఓ సైకో అని విరుచుకుపడ్డారు. తన ఇంట్లో వాచ్మెన్ చనిపోతే.. అతడి డెడ్ బాడీని దాటుకుని మరీ షూటింగ్‌కు వెళ్లిన చరిత్ర బాలయ్యది అని విమర్శించారు. తుపాకీతో ఇద్దరినీ కాల్చి.. మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుని జైలుకు వెళ్లకుండా తప్పించుకున్నాడని ఆరోపించారు. అదే సామాన్యులను అయితే ఎవరైనా వదిలేస్తారా అని పోసాని ప్రశ్నించారు.
బాలకృష్ణపై పోసాని చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోసానిపై బాలయ్య అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏపీ సీఎం జగన్‌ను సైకో అంటూ ఇటీవల బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు బదులుగా పోసాని ఈ విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. అయితే పోసాని ఇలా విరుచుకుపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైన కూడా పోసాని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పవన్ ఫ్యాన్స్ నుంచి ప్రాణహాని ఉందంటూ జనసేనానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుంతం బాలయ్య తన NBK108 మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా చేస్తోంది. మరో హీరోయిన్ శ్రీలీల కోడలి పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలంగాణ యాసలో తెరకెక్కబోయే ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?