రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో జక్కన్న సినిమా అంటే అంచనాలు కచ్చితంగా పీక్స్‌లో ఉంటాయి. ఇక సినిమా కోసం మహేష్ అదిరిపోయేలా మేకోవర్ అవుతున్న సంగతి తెలిసిందే. పలు డిఫరెంట్ సందర్భాల్లో అతడి లుక్ బయటకూ కూడా వచ్చింది. ఎప్పుడు లేని విధంగా లాంగ్ హెయిర్, బీయర్డ్తో తన లుక్‌ను అమాంతం మార్చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అదిరిపోయే స్టైలిష్ లుక్‌తో మహేష్ దర్శనమిచ్చాడు. ఇందుసు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలను షేక్ చేస్తున్నాయి.
మతిపోగొడుతున్న మహేష్ లుక్!
మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో రానున్న ‘SSMB 29‘ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం తన జుట్టు, గడ్డం, బాడీ పెంచి మహేష్ రెడీ అవుతున్నాడు. దీంతో మహేష్ ఈ మధ్య ఎక్కడ కనపడినా అతడి లుక్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి మహేశ్ బాబు లుక్స్ నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. విదేశాలకు వెళ్తున్న క్రమంలో ఎయిర్‌పోర్టులో అతడు స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. క్రీమ్ కలర్ హుడీ వేసుకొని బ్లాక్ గాగుల్స్, రెడ్ క్యాప్ పెట్టుకొని లాంగ్ హెయిర్, రఫ్ గడ్డంతో మహేష్ కనిపించాడు. అయితే ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మహేష్ దంపతులు కలవగా దానికి సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. అప్పటి లుక్‌తో పోలిస్తే ప్రస్తుత లుక్‌లో హెయిర్, గడ్డం ఇంకాస్త గుబురుగా పెరిగిందని చెప్పవచ్చు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.
కొడుకు దగ్గరకేనా?
సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంతో కలిసి రెగ్యులర్‌గా విదేశీ పర్యటనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన మరోమారు విదేశీ టూర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. వైరల్ అవుతున్న మహేష్ ఎయిర్ పోర్టు వీడియోలో అతడితో పాటు భార్య నమ్రత, కూతురు సితారా ఉన్నారు. అయితే అమెరికాలో ఉన్న కుమారుడు గౌతమ్ కోసం ఫ్యామిలీతో కలిసి మహేష్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడా దసరా హాలీడేస్‌ను మహేష్ ఎంజాయ్ చేస్తారని సమాచారం. కాగా, కుటుంబానికి మహేష్ ఇచ్చే ఇంపార్టెన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘SSMB 29’ ప్రాజెక్ట్ మెుదలయ్యే లోపు ఉన్న సమయాన్ని అంతా మహేష్ తన కుటుంబానికే కేటాయిస్తుండటాన్ని ప్రశంసిస్తున్నారు.
మహేష్ లుక్ అసలైంది కాదా?
సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. హాలీవుడ్ హీరోలా ఉన్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘SSMB29’ కోసం మహేష్ లుక్ దాదాపుగా సిద్ధమైనట్లేనని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే టాలీవుడ్ బజ్ ప్రకారం మహేష్ ఇదే లుక్‌లో సినిమాలో కనిపించడని తెలుస్తోంది. ఇంకాస్త గడ్డం, జుట్టు పెంచాక విదేశాల నుంచి హెయిర్ స్టైలిస్ట్‌ను రాజమౌళి పిలిపిస్తారని టాక్. ఆ తర్వాత తను అనుకుంటున్న నాలుగైదు లుక్స్‌లోకి మహేష్‌ను మారుస్తారట. అందులో ఏది బెస్ట్ అని జక్కన్నకు ఫిక్స్ అవుతారో అదే చివరికీ ఫైనల్ అవుతుందని సమాచారం. దీంతో ప్రస్తుత లుక్కే ఫైనల్ అని భ్రమపడిన మహేష్ ఫ్యాన్స్ నాలుక కరుచుకుంటున్నారు.
అందుకే మహేష్‌కు స్వేచ్ఛ!
తన సినిమాల్లోని హీరోల లుక్‌పై రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. సినిమాల్లోని లుక్ బయటకు లీక్ కాకుండా జాగ్రత్తపడుతుంటారు. ఈ మేరకు సదరు హీరోలకు సైతం ముందుగానే రాజమౌళి కండీషన్లు విధిస్తుంటారు. షూటింగ్ జరుగుతున్న కాలం లుక్ రివీల్ కాకుండా చూస్కోవాలని షరతు పెడుతుంటారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల సమయంలో ప్రభాస్, రామ్‌చరణ్, తారక్ ఇదే సూత్రాన్ని పాటించారు. అయితే ఇందుకు భిన్నంగా మహేష్ మాత్రం స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ కెమెరాలకు ఫోజులు ఇచ్చేస్తున్నాడు. తన మేకోవర్‌ను ఏదోక రూపంలో పబ్లిక్కు రివీల్ చేస్తూనే వస్తున్నారు. అయితే మహేష్ ఇలా స్వేచ్ఛగా తిరగడానికి కారణం ఆ లుక్ అసలైనది కాకపోవడమే అని చెప్పవచ్చు. అసలైన లుక్ ఫైనల్ అయ్యాక మహేష్ బయటకి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉంది.
డిసెంబర్ నుంచి షూటింగ్
ప్రస్తుతం ‘SSMB 29’ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ వర్క్ దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో చిత్ర సభ్యులంతా వర్క్ షాప్‌లో పాల్గొంటారని టాక్. డిసెంబర్ నుంచి పక్కాగా రెగ్యులర్ షూటింగ్ మెుదలు పెట్టాలని రాజమౌళి భావిస్తున్నారట. అంతేకాదు ఫస్ట్ షెడ్యూల్‌ను విదేశాల్లో మెుదలు పెట్టేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారట. విదేశాల్లోని అడవుల్లో భారీ ఛేజింగ్ సీక్వెన్స్‌ను జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లోబల్ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ కీలకం కావడంతో ముందుగా వాటికి సంబంధించిన సీన్స్‌ను ఫినిష్ చేయాలని రాజమౌళి నిర్ణయించారట. వాటిని పూర్తి చేసి వీఎఫ్ఎక్స్ విభాగానికి అప్పగిస్తే షూటింగ్‌తో పాటు వీఎఫ్ఎక్స్ పనులు కూడా ప్యార్లర్‌గా జరుగుతాయని రాజమౌళి భావిస్తున్నట్లు తెలిసింది.
Celebrities Featured Articles Political Figure
Revanth Reddy: ‘బన్నీ బౌన్సర్ల వల్లే తొక్కిసలాట’.. సీఎం రేవంత్ సంచలన నిజాలు