అభిషేక్ శర్మ సెంచరీ వృథా
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్లు సత్తా చాటుతున్నారు. క్వార్టర్‌ఫైనల్ పోరులో కర్ణాటకపై అభిషేక్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. కానీ, ఈ మ్యాచులో అభిషేక్ శర్మ ప్రాతినిథ్యం వహిస్తున్న పంజాబ్ జట్టు ఓడిపోయింది. అభిషేక్ సెంచరీ చేసినా మిగతా బ్యాటర్ల సహకారం దక్కకపోవడంతో పంజాబ్ 235 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో కర్ణాటక అతికష్టం మీద గెలిచింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసినా చివర్లో మ్యాచ్ చేజారింది. కాగా, అభిషేక్ శర్మను ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టు అట్టిపెట్టుకుంది. కెప్టెన్‌గానూ నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.