గదిలోకి పిలిచి.. డ్రెస్ విప్పమన్నాడు: వర్షిణి
తాను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని ప్రముఖ తెలుగు యాంకర్ వర్షిణి సౌందరరాజన్ తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వర్షిణి మాట్లాడుతూ ‘‘కెరీర్ ఆరంభంలో ఒక వెబ్‌సీరీస్‌లో నటించే ఛాన్స్ వచ్చింది. ఆడిషన్స్ కోసం ఓ హొటల్‌లో ఉన్న దర్శకుడిని కలిశా. నటించడానికి బాగుంటావు అంటూనే గదిలోకి రమ్మన్నాడు. డ్రెస్ విప్పమని అడిగాడు. నేను వెంటనే తేరుకుని అక్కడికి నుంచి బయటకు వచ్చేశా. మళ్లీ ఆ డైరెక్టర్‌ను ఎప్పుడూ కలవలేదు.’’ అంటూ చెప్పుకొచ్చింది.