• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దుబయ్‌లో ఆసియా కప్‌

  ఆసియా కప్‌ వేదిక మారుతున్నట్లు తెలుస్తోంది. ఆసియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత ఆసియా కప్‌ను పాకిస్తాన్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే టీమిండియా పాక్‌కు రాదని మనవాళ్లు తేల్చిచెప్పారు. దీంతో PCB బోర్డు చైర్మన్‌ నజామ్ సేథి, బీసీసీఐ సెక్రటరీ జై షా ACC మీటింగ్‌లో చర్చలు జరిపారు. దుబయ్‌కి ఆసియా కప్‌ వేదిక మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

  భారత్‌ను వెంటాడుతున్న బౌలింగ్ సమస్య.. ఆస్ట్రేలియా గడ్డపై పరిస్థితేంటి?

  ఆసియా కప్ లో భారత బౌలింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సూపర్ 4 మ్యాచుల్లో బౌలింగ్ దళం తన స్కోరును కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. అయితే, ఇప్పుడు కళ్లన్నీ రానున్న టీ20 ప్రపంచకప్ మీదే. ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న ఈ టోర్నీకి అత్యుత్తమ బౌలింగ్ దళం కావాలి. మరి టీమిండియా ప్రస్తుత పరిస్థితి ఏంటి? కంగారూల పిచ్ లపై మన బౌన్స్ ప్రభావమెలా ఉండబోతోందనేది చర్చనీయాంశం.  జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ త్రయం టీమిండియా బౌలింగ్ … Read more

  ASIA CUP: ఇండియా ఫైనల్ చేరాలంటే..

  ఆసియా కప్‌లో మంగళవారం శ్రీలంకతో మ్యాచ్‌ ఓటమి తర్వాత భారత్‌ ఫైనల్‌ ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. అయితే గణాంకాల ప్రకారం ఇంకా ఫైనల్‌ చేరే అవకాశముంది. అలా జరగాలంటే ఇండియా తన తర్వాతి మ్యాచ్‌ అఫ్గానిస్తాన్‌పై భారీ తేడాతో గెలవాలి. ఆ తర్వాత పాకిస్తాన్‌ తన తర్వాతి రెండు మ్యాచ్‌లూ శ్రీలంక, అఫ్గానిస్తాన్‌తో ఓడిపోవాలి. అప్పుడు నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా భారత్‌ ఫైనల్‌ చేరే అవకాశముంటుంది.

  భారత్- పాక్‌ మధ్య నేడు తొలి మ్యాచ్

  ఆసియా కప్‌లో నేడు భారత్- పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌ను చూసేందుకు క్రీడాభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు టీ-20 ఫార్మట్‌లో ఇరు జట్లు 9 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ ఏడింటిలో నెగ్గింది. ఆసియాకప్‌లో పాక్‌తో జరిగిన 14 మ్యాచ్‌ల్లో టీమిండియా 8 సార్లు గెలిచింది. ప్రస్తుత మ్యాచ్‌లో అందరి కళ్లు కోహ్లీ పైనే ఉన్నాయి. ఫామ్‌లో లేని కోహ్లీ రాణించాలని అభిమానులు భావిస్తున్నారు. ప్రపంచకప్‌లో జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆశిస్తున్నారు. అటు బాబర్ అజామ్ … Read more

  ఆసియా కప్‌లో అత్యధిక రన్స్ చేసింది వీళ్ళే

  ఈనెల 27వ తేదీ నుంచి దుబాయ్ వేదికగా ఆసియా కప్-2022 ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక మాజీ ఆటగాడు జయసూర్య 1220 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో 1075 పరుగులతో సంగక్కర, మూడో స్థానంలో 971 పరుగులతో సచిన్, నాలుగో స్థానంలో 907 పరుగులతో షోయబ్ మాలిక్, అయిదో స్థానంలో 883 పరుగులతో రోహిత్ శర్మ ఉన్నారు.

  ఆసియా కప్‌లో ఎక్కువ వికెట్లు తీసింది వీళ్ళే

  ఈనెల 27వ తేదీ నుంచి దుబాయ్ వేదికగా ఆసియా కప్ జరగనుంది. ఈ కప్ కోసం భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, హాంగ్‌కాంగ్ జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ టోర్నీలో ఇప్పటి వరకు అత్యధికంగా లసిత్ మలింగా 33 వికెట్లను తీసుకున్నాడు. ఆ తరువాత ముత్తయ్య మురళీధరన్ 30, అజంతా మెండిస్ 26, సయీద్ అజ్మల్ 25, షకీబ్ అల్ హసన్ 24 వికెట్లు తీసుకున్నారు.

  కోహ్లీని చూసి సంబరపడాలి: సంజయ్ మంజ్రేకర్

  కొంతకాలంగా బ్యాటు ఝులిపించలేకపోతున్న విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కోహ్లీ పరుగులు చేయడం లేదని బాధపడాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆటతీరు మారింది. జట్టు ఆలోచనలకు తగ్గట్టుగా ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. పరుగులు రావాలనో, ఔటైపోతాననే భయమో అతడిలో లేదు. మొదటి బంతి నుంచే బౌండరీలు బాదాలని చూస్తున్నాడు. ఇది చాలా మంచి విషయం. అభిమానులు అందుకు సంబరపడాలి’ అంటూ స్పోర్ట్స్‌18 షో ‘స్పోర్ట్స్ ఓవర్ ద టాప్’లో అన్నారు. Instagram:Sanjay manjrekar © ANI … Read more

  ఆసియా కప్‌కు అశ్విన్‌ ఎందుకు?: మాజీ సెలెక్టర్

  టీమిండియా ఆసియా కప్‌ జట్టులో సీనియర్ ఆటగాడు అశ్విన్‌ను తీసుకోవడంపై సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ కిరణ్ మోరె అభ్యంతరం వ్యక్తం చేశారు. 15 మంది సభ్యుల జట్టులో అశ్విన్ ఎందుకని ప్రశ్నించాడు. ఆగస్టు 27 నుంచి యూఏఈలో ఆసియా కప్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఇప్పటికే జట్టు కూర్పుపై పలువురు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయగా..తాజాగా కిరణ్ మోరె ఆ జాబితాలో చేరారు.

  ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన

  ఆసియా కప్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (విసి), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, ఆర్ పంత్ (వికె), దినేష్ కార్తీక్ (వికె), హార్దిక్ పాండ్యా, ఆర్ జడేజా, ఆర్ అశ్విన్, వై చాహల్, ఆర్ బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్ , అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్.

  ఆసియా కప్‌కు బుమ్రా దూరం

  త్వరలో జరగనున్న ఆసియా కప్‌కు స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా ఆసియా కప్ టీ20 టోర్నికి దూరమైనట్లు అధికారులు తెలిపారు. బుమ్రా కోలుకునేందుకు సమయం పడుతుందని చెప్పారు. టీ20 ప్రపంచ కప్ కల్లా అతడు తిరిగి జట్టులో చేరతాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గాయంతో బాధపడుతున్న బుమ్రాను ఆసియా కప్‌లో ఆడించి పరిస్థితిని మరింత క్లిష్టం చేయలేమని చెప్పారు.