• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • AUS vs PAK: ఆసీస్‌‌కు రెండో విజయం

    వరల్డ్ కప్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 367 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ మరో ఓటమిని మూటగట్టుకుంది. 45.3 ఓవర్లలో 305 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్‌ 62 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

    AUS vs PAK: ఆసీస్‌‌కు రెండో విజయం

    వరల్డ్ కప్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 367 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ మరో ఓటమిని మూటగట్టుకుంది. 45.3 ఓవర్లలో 305 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్‌ 62 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

    AUS vs SL: శ్రీలంక ఆలౌట్

    ప్రపంచ కప్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక లఖ్‌నవూ వేదికగా తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్‌ ఎంచుకుంది. 21 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్‌ నష్టపోకుండా 121 పరుగులు చేసిన లంక జట్టు… ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో వరుస వికెట్లు కోల్పోయింది. 43.3 ఓవర్లకు 209 పరుగుల వద్ద శ్రీలంక ఆలౌట్ అయింది. ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక (61), కుశాల్‌ పెరీరా (78) తప్ప ఇంకెవరూ రాణించకపోయారు. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా 4 వికెట్లతో రాణించాడు.

    AUS vs SA: ఆసీస్‌ ఘోర ఓటమి

    నేడు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ ఘోర ఓటమిని చవిచూసింది. మొదట బ్యాంటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. అనంతరం బ్యాంటింగ్‌కు దిగిన ఆసీస్ 40.5 ఓవర్లలో 177 పరుగులకే అలౌల్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్‌ లబుషేన్ (46) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్లు మిచెల్ మార్ష్‌ (7), డేవిడ్ వార్నర్‌ (13), వన్‌డౌన్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్ (19), పురుగులు చేశారు.

    అందుకే ఆసీస్ ఓడిపోయింది: మాజీ సెలెక్టర్

    నిన్న జరిగిన భారత్-ఆసీస్ మ్యాచ్ ఫలితంపై మాజీ సెలెక్టర్ కరీం తన విశ్లేషణను వెల్లడించాడు. ‘భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను అద్భుతంగా వినియోగించుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో సరైన సమయంలో బౌలింగ్ వేయించి ఫలితం సాధించాడు. రవీంద్ర జడేజా స్పెల్‌ను లైన్‌కు కట్టుబడి బౌలింగ్ అద్భుతంగా వేశాడు. చాలా రోజుల తర్వాత ఆడుతున్న అశ్విన్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. భారత స్పిన్నర్ల బౌలింగ్ ఎటాక్‌ను రోహిత్ నిడిపించిన తీరు బాగుంది. ఆసీస్ ఆటతీరే వారి ఓటమికి కారణమైంది’ అని కరీం చెప్పుకొచ్చాడు.

    భారత్‌-ఆసీస్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం?

    భారత్‌-ఆస్ట్రేలియా జరుగబోయే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం పొంచిఉంది. చెన్నైలో రేపు పగటి ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఈ క్రమంలో మ్యాచ్ సమయంలో జల్లులు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రేపటి మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా వాష్‌ అవుట్ అయ్యే అవకాశాలు మాత్రం లేవని తెలుస్తుంది. అయితే డెంగీతో బాధపడుతున్న శుభ్‌మన్‌ గిల్‌ ఆసీస్‌తో మ్యాచ్‌కు దూరంకానున్నాడని సమాచారం.