ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఆస్ట్రేలియా బ్రిస్బేన్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న తెలుగు ప్రజలు పండుగ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో అసోసియేషన్ అధ్యక్షుడు కిషోర్, ఉపాధ్యక్షుడు నీలిమ జనుంపల్లి, కార్యదర్శి విన్నీ, ఈసీ సభ్యులు నరేందర్, లక్ష్మీనారాయణ, సురేందర్, బార్గవి, శివాని తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రతి ఏటా ఆస్ట్రేలియాతోపాటు బ్రిటన్, అమెరికా వంటి నగరాల్లో కూడా ఈ పండుగ వేడుకలను తెలంగాణ అసోసియేషన్ నిర్వహిస్తుంది.