ఎండు ద్రాక్షతో ఎన్నో లాభాలు
ఎండు ద్రాక్ష తినడం ద్వారా పలు లాభాలుంటాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పూట ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి ఉదయం లేవగానే తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఆ నీటిని తాగడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందట. వీటిలో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరధోక శక్తిని పెంపొందిస్తాయి. ఎండు ద్రాక్షలోని ఐరన్ రక్తహీనతను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియను మెరుగు పరిచి మలబద్ధకాన్ని తొలగిస్తుంది.