‘యముడు’ డైరెక్టర్‌కు పితృ వియోగం
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. యముడు, సింగం 2 సినిమాల దర్శకుడు హరి తండ్రి వీఏ గోపాలకృష్ణన్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, డైరెక్టర్ హరి ప్రస్తుతం విశాల్ హీరోగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.