• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వన్డే ఐసీసీ ర్యాంకులు విడుదల

    ICC వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ నంబర్‌వన్‌ స్థానం సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ రెండో స్థానానికి దిగజారాడు. శుభ్‌మన్‌ గిల్ 830 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బాబర్‌ అజామ్‌ 824 పాయింట్లు రెండో స్థానంలో ఉన్నాడు. క్వింటన్ డికాక్‌ (771), విరాట్ కోహ్లీ (770), డేవిడ్ వార్నర్ (743) తర్వాతి స్థానాల్లో నిలిచారు. శ్రేయస్‌ అయ్యర్ 17స్థానాలను ఎగబాకి 18వ ర్యాంక్‌ను సాధించాడు.

    ICC Rankings: టాప్-10లో ముగ్గురు టీమిండియా బ్యాటర్లు

    తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.అందులో టీమిండియా బ్యాటర్లు ముగ్గురు టాప్‌-10లో కొనసాగుతున్నారు. పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్ 829 పాయింట్లుతో మొదటి స్థానంలో ఉన్నాడు. గిల్ 823 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ మూడో స్థానానికి దూసుకొచ్చాడు. సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ నాలుగో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ మూడు స్థానాలు మెరుగై ఐదో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

    ICC: టాప్‌ 10లో ముగ్గురు మనోళ్లే

    ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌ టాప్ 10లో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు చోటు సంపాదించారు. శుభమన్ గిల్ 2 ర్యాంకు సాధించగా, రోహిత్ శర్మ 6, విరాట్ కోహ్లీ 8 స్థానం దక్కించుకున్నారు. ఇక టాప్ ర్యాంక్‌లో పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ కొనసాగుతున్నాడు. అటు అన్ని టీమ్స్ విభాగాల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.