• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు బంగ్లాదేశ్‌తో సౌతాఫ్రికా ఢీ

    వరల్డ్ కప్- నేటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో సౌతాఫ్రికా తలపడనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన సౌతాఫ్రికా పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో ఉంది. బంగ్లాదేశ్ ఒక్క విజయంతో ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి బలమైన దక్షిణాఫ్రికాకు షాక్ ఇవ్వాలని బంగ్లా కసరత్తు చేస్తోంది.

    శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం

    వరల్డ్‌కప్‌ టోర్నీలో ఎట్టకేలకు ఆస్ట్రేలియా టీం బోణి కొట్టింది. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి 209 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బరిలోకి దిగిన ఆసిస్ బ్యాటర్లు ధాటిగా ఆడారు. మిడిలార్డర్లు.. లాబుస్చాగ్నే (40), జోష్ ఇంగ్లిస్ (58), మ్యాక్స్ వెల్ (31) రాణించారు. తాజా ఓటమితో వరల్డ్ కప్‌లో వరుసగా మూడు పరాజయాలను శ్రీలంక చవిచూసింది.

    నేడు అఫ్గానిస్థాన్‌తో భారత్ ఢీ

    వరల్డ్‌కప్‌లో భాగంగా ఢిల్లీ- అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టీమిండియా నేడు అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ నెగ్గినప్పటికీ.. టాప్ ఆర్డర్ వైఫల్యం చెందటం కలవరపెట్టింది. పాక్‌తో మ్యాచ్‌కు ముందు టాప్ ఆర్డర్ గాడిలో పడేందుకు ఈ మ్యాచ్ గొప్ప అవకాశం. ఇక అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. మ్యాచ్ 2 గంటలకు ప్రారంభం కానుంది.