• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 25/07/22 నేటి ప్ర‌ధానాంశాలు @ 9.30 PM

  నేడు వీడ్కోలు ప్ర‌సంగం చేసిన రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవిద్..రేపు ద్రౌప‌ది ముర్ము రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణ స్వీకారం నేడు ఇండియా వ‌ర్సెస్ వెస్డిండీస్ రెండో వ‌న్డే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌ నేడు హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగిన లాల్‌ద‌ర్వాజ బోనాల ఉత్స‌వాలు తెలంగాణ కామారెడ్డిలో ఒక వ్య‌క్తికి మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు..హైద‌రాబాద్‌కు త‌ర‌లింపు దేశంలో మొత్తం 4 మంకీపాక్స్ కేసులు నిర్థార‌ణ‌..నేడు ఢిల్లీలో ఒక కేసు న‌మోదు అమెరికాలో క‌రోనా సోకిన వ్య‌క్తికి మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు నేడు మంకీపాక్స్‌పై ఉన్న‌త స్థాయి స‌మీక్ష చేప‌ట్టిన కేంద్రం … Read more

  ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంకు క‌రోనా

  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంకు క‌ర‌నా సోకింది. గ‌త కొన్ని రోజుల నుంచి స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న టెస్ట్ చేసుకోగా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో మ‌ణిర‌త్నంను చెన్నైలోని అపోలో హాస్పిట‌ల్‌లో చేర్చిన‌ట్లు ఆయ‌న భార్య సుహాసిని తెలిపింది. ప్ర‌స్తుతం మ‌ణిత‌ర్నం ఐశ్వ‌ర్య‌రాయ్, విక్ర‌మ్‌, కార్తి, త్రిష వంటి బిగ్‌స్టార్స్‌తో ‘పొన్నియ‌న్ సెల్వ‌న్’ అనే పాన్ఇండియా మూవీ చేస్తున్నాడు.

  ఇండియాలో 13,086 కరోనా కేసులు

  గడిచిన 24 గంటల్లో ఇండియాలో 13,086 కొత్త కరోనా కేసులు నమోదయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. మరో 19 కరోనా సంబంధిత మరణాలు నమోదయ్యాయి. నిన్న 12,456 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ కేసులతో ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య ఒక లక్షా 14 వేలకు చేరుకుంది.

  ఇండియాలో మరో కరోనా వేరియంట్

  ఇండియాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మరో కలవరం మొదలయింది. భారత్ లో మరో కొత్త కరోనా వేరియంట్ పుట్టుకొచ్చిందని ఇజ్రాయెల్ కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ షే ఫ్లీషాన్ ట్వీట్ చేశారు. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఈ వేరియంట్ ను బీకే 2.75గా పేర్కొన్నారు. ఈ వేరియంట్ ను మాత్రం భారత ఆరోగ్య శాఖ ఇప్పటి వరకు ధృవీకరించలేదు.

  మరో రెండేళ్లలో కరోనాను మించిన వైరస్ వస్తోందట!

  ప్రపంచాన్ని కుదిపేసిన కరోనాను మించిన వైరస్ మరో రెండేళ్లలో రాబోతోందట. అయితే ఇది శాస్త్రవేత్తలు చెప్పిన మాట కాదు. తనను తాను ‘టైం ట్రావెలర్’ గా చెప్పుకునే ఓ వ్యక్తి చెప్పిన జోస్యం. తాను 2096 నుంచి వచ్చానని….మరో రెండేళ్లలో కరోనాను మించిన వైరస్ రాబోతోందని హెచ్చరించారు. @timetravlehqr పేరుతో ఉన్నటిక్ టాక్ అకౌంట్లో ఈ వివరాలు వెల్లడించారు. దీనిని అనేకమంది కొట్టిపారేస్తుంటే కొంతమంది మాత్రం అతడి మాటలను నమ్ముతున్నారు. అయితే రోజుకో వైరస్ పుట్టుకొస్తున్న వేళ ఇలా జోస్యం చెప్పడంలో వింతేం లేదని … Read more

  విదేశాల‌కు వెళ్లే ముందు ఒక‌సారి క‌రోనా హైరిస్క్ దేశాలేవో చూడండి

  క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టింది. హాలిడే కోసం విదేశాలు వెళ్లాల‌నుకుంటున్నారా? అయితే క‌రోనా ముప్పు పొంచి ఉన్న దేశాల జాబితాను ఒక‌సారి ప‌రిశీలించండి. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (US CDC ) విడుద‌ల చేసిన అధిక ప్ర‌మాదం (High Risk) దేశాల జాబితాను ప్ర‌క‌టించింది. మొత్తం ఇందులో స్పెయిన్‌, ఇట‌లీ, ఐర్లాండ్, ఫ్రాన్స్‌, జర్మ‌నీ, నెద‌ర్లాండ్స్, నార్వే, కువైట్, థాయ్‌లాండ్, మ‌లేషియా, సౌత్ కొరియా, కెన‌డా వంటి మొత్తం 115 దేశాలు ఉన్నాయి. ఇవి లెవ‌ల్‌-3 కేట‌గిరీలోకి వ‌స్తాయి. … Read more

  AP: కోవిడ్ నాలుగో వేవ్ కు ఇది సంకేతమా?

  ఏపీలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతూ పోతున్నాయి. అప్పట్లో రోజవారీ బులిటెన్ విడుదల చేసిన ప్రభుత్వం కేసులు తగ్గాయనే ఉద్దేశంతో మే 1 నుంచి బులిటెన్ విడుదల ఆపేసింది. ఈ బులిటెన్ వస్తే అయినా ప్రజల్లో కాస్త కరోనా టెన్షన్ ఉండేదేమో? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు భారీగా టెస్టులు చేసిన గవర్నమెంట్ ఇప్పుడు టెస్టులను విపరీతంగా తగ్గించేసింది. వందల్లో ఉన్న యాక్టివ్ కేసులు కాస్త ఇప్పుడు వేలల్లోకి మారాయి. ఇకనైనా ప్రజలు మేల్కొని కరోనా నిబంధనలు పాటించాలని పలువురు హెచ్చరిస్తున్నారు.

  Categories AP

  కరోనా బారిన పడ్డ కెప్టెన్ శర్మ

  ఇంగ్లండ్ టూర్ లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. తాజాగా వెలువడిన ర్యాపిడ్ టెస్ట్ రిజల్ట్స్ లో శర్మకు పాజిటివ్ గా తేలింది. దీంతో జూలై 1 వ తేదీన జరగాల్సిన టెస్టును శర్మ ఆడతాడా? లేదా అనేది అనుమానంగా మారింది. కాగా ప్రస్తుతం లీసెస్టర్ షైర్ జట్టుతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచులో మాత్రం శర్మ పాల్గొంటున్నాడు. నేడు 26వ తేదీ కావడం టెస్టుకు 4 రోజుల సమయం మాత్రమే ఉండడంతో శర్మ టెస్టు ఆడేది అనుమానమే అని … Read more

  సోనియాగాంధీకి ఊరటనిచ్చిన ఈడీ

  కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఊరటనిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణను వాయిదా వేయాలని సోనియా గాంధీ కోరగా.. అందుకు ఈడీ సానుకూలంగా స్పందించింది. సోనియా గాంధీ తనకు కరోనా వల్ల ఆరోగ్యం బాగాలేదని విచారణను వాయిదా వేయాలని కోరారు. విచారణను జూలై మధ్యనాటికి వాయిదా వేస్తూ ఈడీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో సోనియా కుమారుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ 50 గంటలకుపైగా విచారించింది.

  ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కనున్న స్టార్ స్నిన్నర్

  స్టార్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దాంతో అతడు ఈ నెల 16న భారత ఆటగాళ్లతో ఇంగ్లండ్ టూర్ కు వెళ్లలేకపోయాడు. కానీ ప్రస్తుతం అశ్విన్ కరోనా నుంచి కోలుకున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో నేడు అతడు ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కుతాడని.. బీసీసీఐ అధికారి ఒకరు ప్రకటించారు. అశ్విన్ కు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని, దీంతో అతడిని ఇంగ్లండ్ కు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు.