సెంచరీతో చెలరేగిపోయిన ఓజా
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ ఇరగదీసింది. నమన్ ఓజా సెంచరీతో చెలరేగిపోవడంతో శ్రీలంకకు 196 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాయ్‌పూర్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సచిన్ డకౌట్ అయ్యాడు. రైనా, యువరాజ్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. అయినప్పటికీ నమన్ ఓజా ఒక్కడే నిలబడి 71బంతుల్లో 108 పరుగులు చేశాడు. సెమీఫైనల్లోనూ ఆసీస్‌పై ఈ ఓపెనర్ 90పరుగులు చేశాడు. కీలక సమయంలో భారీ ఇన్నింగ్స్ ఆడాడు.