చాపర్‌తో కమల్ హాసన్.. ఏపీలో షూటింగ్
కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న ‘భారతీయుడు2’ సినిమా షూటింగ్ వడివడిగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పరిసరాల్లో ప్రస్తుత షెడ్యూల్‌ని చిత్రబృందం తెరకెక్కిస్తోంది. అయితే, ఈ షూటింగ్‌కు వచ్చిపోవడానికి కమల్ హాసన్ ప్రత్యేకంగా చాపర్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ చాపర్కి సంబంధించిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కమల్ హాసన్ డైనమిక్‌గా కనిపిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.