ఇన్‌స్టా పరిచయం..గర్భవతిని చేసి మాయం
ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై యువతిని గర్భవతిని చేశాక మొహం చాటేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. బంజారాహిల్స్‌లో నివాసించే 22 ఏళ్ల యువతికి, 2020లో వరంగల్‌కు చెందిన కల్యాణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో దగ్గరవడంతో శారీరకంగా కలిశారు. యువతి గర్భం దాల్చాక.. అబార్షన్ చేయించుకోవాలని లేదంటే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. ఆ తర్వాత వారం రోజులు కనిపించకుండా పోవడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.